మహేష్‌ కంటే సంపూ నయం.. నిజమే కదా?       2018-04-26   06:07:20  IST  Raghu V

సినిమా పరిశ్రమ ప్రముఖులు ఏపీ ప్రత్యేక హోదా కోసం ముందుకు రావడం లేదని, వారికి ఈ విషయం అస్సలు పట్టినట్లుగానే వ్యవహరించడం లేదు అంటూ ఇటీవలే టీడీపీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే. సినిమా పరిశ్రమకు చెందిన వారు ఏపీ కోసం చేస్తున్న ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సినిమా పరిశ్రమకు చెందిన స్టార్స్‌ ఎవరు కూడా ప్రత్యేక హోదా విషయమై నోరు విప్పలేదు. సినిమా పరిశ్రమ ప్రముఖులు ప్రత్యేక హోదా కోసం రోడ్డు ఎక్కితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని కొందరు భావిస్తున్నారు.

-

తాజాగా ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ సినిమా పరిశ్రమ వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తుంటే సినిమా ప్రముఖులు ముఖ్యంగా హీరోలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సినిమా పరిశ్రమకు ఏపీ నుండి కోట్ల ఆధానం వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు ఏపీ ప్రజల కోసం వారు ముందుకు రావడం లేదు అంటూ చలసాని ప్రశ్నించాడు. ఈయన ముఖ్యంగా మహేష్‌బాబును టార్గెట్‌ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.ప్రత్యేక హోదా ఉద్యమంలో కమెడియన్‌ సంపూర్నేష్‌బాబు పాల్గొన్నాడు. ఏపీ ప్రజల కోసం సంపూర్నేష్‌బాబు జైలుకు కూడా వెళ్లేందుకు సిద్దం అయ్యాడు. కాని మహేష్‌బాబు మాత్రం ఇప్పటి వరకు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో నోరు మెదపలేదు. ఏపీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏపీకి చెందిన కృష్ణ కొడుకు మహేష్‌బాబు స్పందించక పోవడం ఏంటని, ఒక స్టార్‌ హీరో ముందుకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో తెలుగు హీరోలు తమిళ హీరోలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి అంటూ చలసాని సలహా ఇచ్చాడు. తమిళనాడులో ప్రజల కోసం, రైతుల కోసం పలు సందర్బాల్లో స్టార్‌ హీరోలు రోడ్డు ఎక్కిన సంఘటనలు ఉన్నాయి.

త్వరలోనే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని, ఆ ఉద్యమంలో ఏపీకి చెందిన సినిమా స్టార్స్‌ తప్పనిసరిగా పాల్గొనాల్సిందే అంటూ ఆయన డిమాండ్‌ చేశాడు. ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దలకు మరియు స్టార్స్‌కు త్వరలోనే అల్టిమేటం జారీ చేస్తామని, అందుకు తగ్గట్లుగా వారు నడుచుకోకుంటే వారిపై తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామని కూడా చలసాని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పటికైనా ఒక్కరు ఇద్దరు కాకుండా సినిమా పరిశ్రమ మొత్తం ఏపీకి ప్రత్యేక హోదా విషయమై పోరాడాలని ఆయన కోరాడు. మరి మహేష్‌తో పాటు ఇతరులు ఏపీ కోసం ముందుకు వస్తారా అనేది చూడాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.