తమిళ దర్శకుడికి నో చెప్పిన మహేష్..!

సర్కారు వారి పాట సక్సెస్ జోష్ లో ఉన్న మహేష్ నెక్స్ట్ త్రివిక్రం తో సినిమాకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే.

 Mahesh Said No To Tamil Director Lokesh Kanagaraj,lokesh Kanagaraj,mahesh Babu, Spyder, Master, Vijay,ar Murugadoss-TeluguStop.com

అయితే ఈ గ్యాప్ లో మహేష్ మరో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి కానీ అందుకు ఛాన్స్ లేదని తెలుస్తుంది.ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ మహేష్ కోసం ఒక కథ సిద్ధం చేశారట.

ఈమధ్యనే మహేష్ ని కలిసి స్టోరీ నరేట్ చేసినట్టు టాక్.అయితే మహేష్ మాత్రం అతని ఆఫర్ ని రిజెక్ట్ చేశాడని అంటున్నారు.

 Mahesh Said No To Tamil Director Lokesh Kanagaraj,Lokesh Kanagaraj,Mahesh Babu, Spyder, Master, Vijay,AR Murugadoss-తమిళ దర్శకుడికి నో చెప్పిన మహేష్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కోలీవుడ్ లో స్టార్ రేంజ్ తెచ్చుకున్న డైరక్టర్ లోకేష్ కనగరాజ్ మహేష్ తో సినిమా చేయాలని ఉత్సాహంగా ఉన్నారట.కానీ మహేష్ మాత్రం ఇప్పుడప్పుడే తమిళ దర్శకులతో సినిమా చేసే ఆలోచనలో లేరన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆల్రెడీ మురుగదాస్ తో చేసిన స్పైడర్ రిజల్ట్ కూడా ఇందుకు కారణమని అనుకోవచ్చు.అయితే మహేష్ కాదని చెప్పడంతో లోకేష్ కనగరాజ్ మళ్లీ దళపతి విజయ్ తోనే ఓ సినిమా కన్ ఫర్మ్ చేసుకున్నాడు.

ఆల్రెడీ విజయ్ తో మాస్టర్ సినిమా చేసిన లోకేష్ విజయ్ 67వ సినిమా ఛాన్స్ కూడా అందుకున్నాడని తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube