ఆలూ లేదు సూలు లేదు బడ్జెట్‌ 300 కోట్లా?

దర్శక ధీరుడు రాజమౌళి రెండు వారాల క్రితం ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తర్వాత మహేష్‌బాబుతో సినిమా చేయాల్సి ఉందంటూ చెప్పుకొచ్చాడు.అంతకు మించి మరేం మాట్లాడలేదు.

 Rajamouli 300 Crores Budget Movie With Mahesh Babu, Mahesh Babu, Rajamouli, 300-TeluguStop.com

అప్పటి నుండి పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.సోషల్‌ మీడియాలో వీరిద్దరి మూవీ గురించి కుప్పలు తెప్పలుగా కథనాలు అల్లేస్తున్నారు.

కథ అది, నేపథ్యం ఇది, బడ్జెట్‌ ఇది అంటూ రకరకాలుగా కథనాలు మీడియాలో వండి వడ్డిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు 300 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లుగా ప్రచారం మొదలైంది.

మహేష్‌బాబుతో 300 కోట్ల సినిమాకు జక్కన్న ప్లాన్‌ చేస్తున్నాడు అటూ మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్నాయి.ఇవి పిచ్చి పుల్కా వార్తలు అనే విషయం అందరికి తెలిసినా కూడా ఆసక్తిగా ఈ విషయం గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్‌ కనబర్చుతున్నారు.

ఇప్పటి వరకు అసలు మహేష్‌ బాబు సినిమా విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదు.

Telugu Mahesh Babu, Rajamouli, Rajamoulibudget-

బాహుబలి సమయంలో కూడా మహేష్‌బాబుతో జక్కన్న సినిమా చేయాలనుకున్నాడు.కాని అది కాలేదు.ఇప్పుడు అయినా వస్తుందా లేదా అనేది తెలియదు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు.అయినా కూడా 300 కోట్లు బడ్జెట్‌ అంటూ రావడం హాస్యాస్పందంగా ఉంది.

తెలుగులో ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్లుగా సినిమా గురించి ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండానే 300 కోట్లు అనడం విడ్డూరంగా ఉందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube