నువ్వు నిజమైన కలెక్షన్స్‌ చెప్తే, మహేష్‌ ఫేక్‌ కలెక్షన్స్‌ చెప్పాడా?  

Mahesh Babu Shows Fake Collections But Allu Arjun Shows Real Collections-allu Arjun,mahesh Babu,sankranthi Sarileru,మహేష్‌ ఫేక్‌ కలెక్షన్స్‌

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో మరియు సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ పడ్డాయి.అయితే చివరకు సంక్రాంతి విజేతగా అల వైకుంఠపురంలో చిత్రం నిలిచిన విషయం తెల్సిందే.

Mahesh Babu Shows Fake Collections But Allu Arjun Shows Real Collections-allu Arjun,mahesh Babu,sankranthi Sarileru,మహేష్‌ ఫేక్‌ కలెక్షన్స్‌-Mahesh Babu Shows Fake Collections But Allu Arjun Real Collections-Allu Mahesh Sankranthi Sarileru మహేష్‌ ఫేక్‌ కలెక్షన్స్‌

ఈ సమయంలోనే సరిలేరు నీకెవ్వరు చిత్రం కలెక్షన్స్‌ను కొందరు ఫేక్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు.వంద కోట్ల రూపాయలను రాబట్టిందని మహేష్‌ అండ్‌ టీం ప్రకటిస్తే అవి ఉత్తి వార్తలంటూ కామెంట్స్‌ చేసే వారు చాలా మంది ఉన్నారు.
మామూలు జనాలు కామెంట్స్‌ చేస్తే పర్వాలేదు.కాని సంగీత దర్శకుడు థమన్‌ ఆ విషయమై కామెంట్స్‌ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

అల వైకుంఠపురంలో చిత్రం సక్సెస్‌ వేడుక వైజాగ్‌లో జరిగిన విషయం తెల్సిందే.ఆ వేడుక సందర్బంగా ఈ సినిమా నిజమైన కలెక్షన్స్‌ చెబుతున్నాం అంటూ గట్టిగా చెప్పడం పదే పదే ఆ విషయాన్ని ప్రస్థావించడంతో అల్లు అరవింద్‌ మరియు త్రివిక్రమ్‌లు గట్టిగా నవ్వడంతో థమన్‌ వ్యాఖ్యలు మహేష్‌కు కౌంటర్‌ అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ప్రస్తుతం థమన్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.నువ్వు నిజమైన కలెక్షన్స్‌ చెబుతున్నావని అంటున్నావు.మరి సరిలేరు నీకెవ్వరు సినిమా కలెక్షన్స్‌ పేకా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పుడు నువ్వు తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అయ్యేందుకు నిలదొక్కుకునేందుకు చాలా సాయపడింది మహేష్‌బాబు అనే విషయం గుర్తుంచుకో.

ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు నువ్వు మహేష్‌ను కౌంటర్‌ చేస్తావా అంటూ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

Mahesh Babu Shows Fake Collections But Allu Arjun Shows Real Collections-allu Arjun,mahesh Babu,sankranthi Sarileru,మహేష్‌ ఫేక్‌ కలెక్షన్స్‌ Related....