మహేష్‌బాబు గతంతో పోల్చితే ఈ రెండు మూడేళ్లుగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు.ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను కన్ఫర్మ్ చేస్తున్నాడు.సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు విడుదల చేసే ఉద్దేశ్యంతో మహేష్‌బాబు చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు.
మొన్ననే మహర్షి రాగా ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు.వచ్చే ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు మూవీ రాబోతుంది.ఆ చిత్రం తర్వాత మహేష్‌బాబు మరో సినిమా కన్ఫర్మ్ అయ్యింది.

చాలా రోజులుగా గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో మహేష్‌బాబు ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు ఆ సినిమాను అల్లు అరవింద్ నిర్మించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.అయితే అల్లు అరవింద్ నిర్మిస్తే నిర్మాణంలో వాటాను మహేష్‌బాబు అడిగినట్లుగా తెలుస్తోంది.దాంతో అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.మహేష్‌బాబు అదే ప్రాజెక్ట్‌ను కొరటాల శివకు అప్పగించాడు.
నిర్మాణంపై చాలా రోజులుగా ఆసక్తిగా ఉన్న కొరటాల శివ తన మిత్రుడు సుధాకర్‌తో కలిసి నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

శ్రీమంతుడు మరియు భరత్ అనే నేను రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చినందుకు గాను మహేష్‌బాబు తన తదుపరి చిత్రం నిర్మాణ బాధ్యతలను కొరటాల శివకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.పరుశురామ్ తయారు చేసిన స్క్రిప్ట్ నచ్చిన నేపథ్యంలో కొరటాల శివ నిర్మాణంలో ఎంటర్ అవ్వబోతున్నాడు.
తాను ఒక డైరెక్టర్ అయ్యి ఉండి, ఒక స్టార్ హీరో మూవీని మరో దర్శకుడితో నిర్మించేందుకు సిద్దం అవ్వడం ఆశ్చర్యంగా ఉంది.త్వరలో చిరంజీవితో మూవీని కొరటాల శివ ప్రారంభించబోతున్నాడు.
ఒక వైపు దర్శకుడిగా మరో వైపు నిర్మాతగా కొరటాల శివ మస్త్ బిజీ అయ్యే అవకాశం ఉంది.