పోలీస్ అంటాడు.. కాని చివరికి ఏం చేస్తాడో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కేటుగాళ్ల బెడద ఎక్కువైపోతుంది జనాలకి.ముఖ్యంగా పోలీసులమంటూ మాయమాటలు చెప్పి నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి.

 Person Arrested Yashwantha Oura Who Fled Away Cell Phones,  Mahesh Nayak, Yashwa-TeluguStop.com

ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.యశ్వంతపుర గాయత్రి నగర్ కు చెందిన మహేష్ నాయక్ అనే వ్యక్తి పోలీసునంటూ మాయమాటలు చెప్పి ఏకంగా 2.87 లక్షల విలువైన సెల్ఫోన్లను దొంగలించాడు.

తాజాగా ఈ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.వేద మూర్తి అనే వ్యక్తి ఈ నెల 8న జికే ప్రింటింగ్ వద్ద కారు నిలిపాడు.

అక్కడే ఉన్న మహేష్ నాయక్ తాను పోలీసు అంటూ ఆ వ్యక్తితో పరిచయం చేసుకొని.తన పై అధికారికి కారు అద్దెకు కావాలంటూ రాజాజీ నగర్ 17వ క్రాస్ రోడ్డు వద్దకు సదరు వ్యక్తిని తీసుకెళ్లాడు మహేష్ నాయక్.

తన పై అధికారి తో ఫోన్ మాట్లాడాలని వేదమూర్తి దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాడు.దీంతో పోలిసే కదా అని ఫోన్ ఇస్తే సెల్ఫోన్ తో ఉడాయించాడు నిందితుడు.

ఇక వేదమూర్తికి ఏమీ అర్థం కాక కాస్త షాక్ లో కాస్త అయోమయం లో ఉండిపోయాడు.అయితే ఈ నిందితుడు గతంలో ఒక బైక్ చోరీ చేసి నెంబర్ ప్లేట్ మార్చి సంచరిస్తుండగా కూడా పట్టుబడ్డాడు.

ఇప్పటికే ఇతని పై పలు పోలీసు కేసులు ఉన్నట్లు గుర్తించారు సుబ్రహ్మణ్యం నగర పోలీసులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube