మహేష్, నమ్రత ఫోటో నెట్టింట వైరల్!  

mahesh namrata photo viral in Social Media mahesh babu, namrata, viral photo, social media, - Telugu @urstrulymahesh, Mahesh Babu, Namrata, Social Media, Viral Photo

మన టాలీవుడ్ స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు ఒకప్పుడు ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసేవారు.అయితే కరోనా, లాక్ డౌన్ వాళ్ల ప్లానింగ్ ను పూర్తిగా మార్చేసింది.

TeluguStop.com - Mahesh Namrata Photo Viral In Internet

షూటింగ్ లతో, కొత్త సినిమా కథలతో బీజీగా ఉండే హీరోలు, హీరోయిన్లు లాక్ డౌన్ వల్ల పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు.చాలామంది హీరోలు లాక్ డౌన్ సమయంలో తమ లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నారు.

కొత్త లుక్ లకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

TeluguStop.com - మహేష్, నమ్రత ఫోటో నెట్టింట వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కొందరు హీరోలు ఫిట్ నెస్ కోసం వర్కౌట్లు చేస్తున్నారు.

స్టార్ హీరో మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు.వర్కౌట్లు చేయడంతో పాటు ఈత కొట్టడం, పిల్లలతో కలిసి ఆటలు ఆడటం చేస్తున్నారు.

మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో మహేష్ బాబుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా నమ్రత సోషల్ మీడియాలో నమ్రత మహేష్ తో దిగిన ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది.

వయస్సులో మహేష్ బాబు కంటే పెద్దదైన నమ్రత సోషల్ మీడియాలో ఫోటోతో పాటు ఒక మెసేజ్ కూడా పెట్టింది.నమ్రత సృష్టిలో మనుషులను ప్రేమ మాత్రమే సంతోషంగా ఉంచుతుందని… మన ఉనికికి ప్రేమే ముఖ్య కారణం అని బలంగా విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు.

ప్రేమ వల్ల వచ్చే భావోద్వేగాల నుంచి జాలి, కరుణ, దయ ఉత్పన్నమవుతాయని ఆమె అన్నారు.ఒకరిపై ఒకరు దయగా ప్రేమతో ఉండాలని ఆమె కోరారు.

మనం ఇవ్వడానికి ఒక జీవితం, జీవించడానికి ఒక జీవనం ఉండాలని ఆమె అన్నారు.మహేష్ బాబు నటించిన గత మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు కాగా ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు.

#Mahesh Babu #@urstrulyMahesh #Namrata #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Namrata Photo Viral In Internet Related Telugu News,Photos/Pics,Images..