‘ఆర్‌’ మల్టీస్టారర్‌లోకి మహేష్‌ను లాగే ప్రయత్నం  

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ వంటి బిగ్గెస్ట్‌ సూపర్‌ హిట్స్‌ తర్వాత తెరకెక్కబోతున్న చిత్రం అవ్వడంతో మల్టీస్టారర్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ సినిమాల సంఖ్య చాలా తగ్గింది. ఒక వేళ వచ్చినా చిన్న చితకా మల్టీస్టారర్‌ చిత్రాలు వచ్చాయి...

‘ఆర్‌’ మల్టీస్టారర్‌లోకి మహేష్‌ను లాగే ప్రయత్నం-

కాని టాలీవుడ్‌లో టాప్‌ హీరోల మల్టీస్టారర్‌లు మాత్రం రావడం ఇదే అవ్వడంతో ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ వంటి సూపర్‌ స్టార్‌ హీరోలు ఒక సినిమాలో కలిసి నటించడం, ఆ సినిమాకు టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించడం వంటి కారణాల వల్ల సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్లతో నిర్మిస్తున్నాడు అని, రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల పారితోషికం ఏంకంగా 100 కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే ఈ చిత్రంలో మహేష్‌బాబు కూడా నటిస్తాడు అనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, మహేష్‌బాబులు మంచి స్నేహితులు. ఈ ముగ్గురు కూడా ఇటీవల వరుసగా కలుస్తూ పార్టీలు గట్రా చేసుకుంటున్నారు.

సినిమాలను పక్కన పెడితే మేము మంచి స్నేహితులం అంటూ ఈ ముగ్గురు కూడా పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో సూపర్‌ హిట్‌ను దక్కించుకున్న మహేష్‌బాబు ఇటీవలే రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లకు పెద్ద పార్టీ ఇవ్వడం జరిగింది. ఇటీవల తరుచుగా ఈ ముగ్గురు కలిసి కనిపిస్తున్న కారణంగా జక్కన్న మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లతో పాటు మహేష్‌బాబు కూడా నటిస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరి కొందరు మల్టీస్టారర్‌ చిత్రంలో మహేష్‌బాబు చిన్న పాత్రలో అయినా కనిపిస్తే బాగుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మల్టీస్టారర్‌ చిత్రంలో మహేష్‌బాబును కోరుకుంటున్నారు.

కాని అది కాదని రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో సినిమాను మొదలు పెట్టాడు. ఆయన చెప్పినట్లుగా కాకుండా వీరితో మల్టీస్టారర్‌ చేయడంతో మహేష్‌బాబు ఫ్యాన్స్‌ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. వారి కోసం మహేష్‌బాబును కూడా మల్టీస్టారర్‌లో నటింపజేస్తే సినిమా క్రేజ్‌ పెరిగడంతో పాటు, ఖచ్చితంగా మహేష్‌బాబు ఫ్యాన్స్‌ సంతోషంను వ్యక్తం చేస్తారు.

అందుకే జక్కన్న ప్లీజ్‌ కాస్త ఈ విషయాన్ని ఆలోచించరాదు అని సినీ ప్రేమికులు కోరుతున్నారు. ఎన్టీఆర్‌, చరణ్‌లు స్నేహితులే అవ్వడం వల్ల మహేష్‌బాబు మల్టీస్టారర్‌కు ఓకే చెప్పే అవకాశం ఎక్కువే.