సరిలేరు నీకెవ్వరూ నుంచి ఒక పిక్ లీక్,సోషల్ మీడియా లో వైరల్  

Mahesh Latest Pic Leak From Sarileru Neekevvaru Movie Making-mahesh Latest Pic Leak,sarileru Neekevvaru Movie,vijaya Shanthi In Sarileru Neekevvaru Movie

మహర్షి చిత్రం తరువాత ప్రిన్స్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రమే ‘సరిలేరు నీకెవ్వరూ’. రష్మిక మందన్న హీరోయిన్ గా తొలిసారి మహేష్ పక్కన నటిస్తుండగా,మరోపక్క సీనియర్ హిరోయిన్ విజయశాంతి కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. అయితే ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులలో ఒక ఆసక్తి కలిగింది..

సరిలేరు నీకెవ్వరూ నుంచి ఒక పిక్ లీక్,సోషల్ మీడియా లో వైరల్ -Mahesh Latest Pic Leak From Sarileru Neekevvaru Movie Making

అయితే ఈ చిత్రం లో అసలు మహేష్ రోల్ ఏంటి, ఎలా ఆయన క్యారెక్టర్ ఉండబోతుంది అన్న దానిపై పెద్దగా సమాచారం లేకపోయినా ఆ చిత్రం లో ఆర్మీ ఆఫీసర్ గా మాత్రం నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆ చిత్ర షూటింగ్ లొకేషన్ నుంచి ఒక పిక్ లీక్ అయ్యింది. అంతే ఇక ఆ పిక్ చూసిన ప్రతిఒక్కరూ కూడా తెగ ఆ చిత్రంలో మహేష్ పాత్ర గురించి ఊహించేస్తున్నారు.

ఇంతకీ ఆ పిక్ లో మహేష్ ఎలా ఉన్నాడో తెలుసా. ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మిలిటరీ దుస్తులు ధరించి తన బెటాలియన్ లోని ఇతర ఆర్మీ కొలీగ్స్ తో కలిసి ఎదో సీరియస్ గా నడుం ఫై చేయి వేసి మరీ చర్చిస్తూ ఉన్నాడు.

ఆ పిక్ చూసి న అభిమానులు మహేష్ స్టైల్ కు ఫిదా అవుతున్నారు. ఇక మిలిటరీ యూనిఫామ్ పై ఉన్న బ్యాడ్జిలు చూస్తుంటే ఏదో సాదా సీదా జవానులా కాకుండా ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ లాగా మహేష్ కనిపించనున్నట్లు అభిమానులకు అర్ధం అవుతుంది.

ఇక మహేష్ కు సంబందించి ఈ ఫోటో లీక్ అయ్యిందో లేదో ఇక సోషల్ మీడియా లో తెగ వైరల్ అయిపొయింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.