రాజమౌళి తో సినిమా విషయంలో క్లారిటీ కోరుతున్న మహేష్ అభిమానులు !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రేపు పుట్టిన రోజు జరుపు కుంటున్న సందర్భంగా ఫ్యాన్స్ పది రోజులు ముందు నుండే సందడి మొదలు పెట్టిన విషయం తెలిసిందే.ఇప్పటికే మహేష్ బాబు పుట్టిన రోజున అదిరిపోయే సర్ప్రైజ్ లు ఉన్నాయని తెలుస్తుంది.

 Mahesh Fans Want Clarity On Rajamouli Movie, Mahesh Babu, Birthday Special, Raja-TeluguStop.com

ఈ విషయంపై పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చర్చించు కుంటున్నారు.ఎలాంటి అప్డేట్ లు ఇస్తారు.

అని.

ముఖ్యంగా మహేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్కారు వారి పాట.ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మొత్తానికి సూపర్ స్టార్ బర్త్ డే కానుకగా ఆగస్టు 9 న అదిరిపోయే బర్త్ డే బ్లాస్టర్ రెడీ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన రానే వచ్చింది.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Telugu Mahesh Babu, Maheshfans, Rajamouli, Sarkaruvaari-Latest News - Telugu

ఈ సందర్భంగా ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు సర్కారు వారి పాట నుండి ప్రత్యేకమైన పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు.ఆ తర్వాత సోమవారం ఉదయం 9 గంటలకు అదిరిపోయే టీజర్ మన ముందుకు రాబోతుంది.ఇంతేకాదు ఇంకా త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా పై కూడా ఒక ఎక్సయిటింగ్ అప్డేట్ ఉంటుందని తెలిసి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

అయితే వీటితో పాటు మహేష్ అభిమానులు ఇంకో విషయం పై కూడా క్లారిటీ కోరుతున్నారు.ఎప్పటి నుండో మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయినా కూడా ఇతి రాజమౌళి కానీ.అటు మహేష్ బాబు కానీ ఈ విషయం మీద స్పందించలేదు.

అందుకే త్రివిక్రమ్ తో సినిమా తర్వాత మహేష్ రాజమౌళి కాంబోలో సినిమా ఉంటుందా లేదా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.చూడాలి మరి మహేష్ పుట్టినరోజు ఎన్ని సర్ప్రైజ్ లు ఇస్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube