చిరంజీవి రికార్డు కోసం లక్షలు ఖర్చుపెడుతున్న మహేష్ ఫ్యాన్స్     2017-10-21   01:11:50  IST  Raghu V

అభిమానుల పైత్యానికి హద్దు అదుపు మొదటి నుంచి లేదు. ఎన్టీఆర్, కృష్ణల కాలం నుంచి చూస్తున్నదే. కాలం మారినా కొద్ది అన్ని మారుతున్నాయి, అందరు మారుతున్నారు కాని ఈ స్టార్ హీరోల అభిమానులు మాత్రం మారడం లేదు. కొత్తగా చెప్పాలంటే RTC క్రాస్ రోడ్స్ లో అందరు హీరోలకి కోటి రూపాయల గ్రాస్ చిత్రాలు ఉన్నాయి, మా ఎన్టీఆర్ కె లేదని, అక్కడ 90 లక్షల గ్రాస్ వసూలు చేసిన జైలవకుశ చిత్రాన్ని కోటి మార్కు దాటించే కంకణం కట్టుకున్నారు నందమూరి అభిమానులు. థియేటర్ వారు 15 లక్షలు అడుగుతోంటే, వెనకడుగు మాత్రం వేయడం లేదట. ఎలా చేసినా జైలవకుశని ఇక్కడ 50 రోజులు ఆడించి, థియేటర్ కి జనాలు వచ్చినా, రాకపోయినా DCR లో తమ జేబు నుంచి తీసే డబ్బుతో నంబర్లు నింపి ఎన్టీఆర్ చేతిలో ఒక మైలురాయి పెట్టడలిచారు ఫ్యాన్స్.

ఇక మా పైత్యానికి ఏమి తక్కువా అంటూ మహేష్ బాబు అభిమానులు కూడా పోతిపడుతున్నారు. అదే క్రాస్ రోడ్స్ లో సైనికుడు లాంటి ఫ్లాప్ సినిమాని 18 లక్షలు కట్టి 100 రోజులు ఆడించిన ఘనత వారిది. ఇప్పుడు విజయవాడలో తమ రికార్డు ఒకటి మెయింటేన్ చేసేందుకు మళ్ళీ లక్షలు బయటకి తీస్తున్నారు. ఆ రికార్డు ఏంటో చూడండి.

గ్యాంగ్ లీడర్ నుంచి మొదలు ఖైది నం 150 వరకు విజయవాడలో చిరంజీవి సినిమాలన్నీ 50 రోజులు ఆడాయి. మధ్యలో వచ్చిన కొన్ని ఫ్లాప్, డిజాస్టర్ సినిమాలను ఆడించారు అభిమానులు. ఇక మహేష్ బాబు రాజకుమారుడు నుంచి మొన్నటి బ్రహ్మోత్సవం దాకా, 22 చిత్రాలన్నీ విజయవాడలో 50 రోజులు ఆడాయి. మరి బ్రహ్మోత్సవాన్నే 50 రోజులు ఆడించారు అంటే, స్పైడర్ ఏం పాపం చేసింది, ట్రాక్ రికార్డు ఎందుకు పోగొట్టుకోవాలి, చిరంజీవి రికార్డుని దాటే చాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలి అనుకున్నారేమో, సొంత ఖర్చులతో ఇప్పుడు 50 రోజులు ఆడిస్తారట. ఏంటో వీళ్ళ వెర్రితనం.