డబ్బు కోసం మహేష్‌ భార్య పిల్లలను కూడా రంగంలోకి దించాడు  

Mahesh Family Act In Sai Surya Developers Ad - Telugu Mahesh Act So Many Ad Films, Mahesh Family, Mahesh Present In Sari Leru Nekevvaru, Thums Up Brand Ambasidor, Tollywood Super Star Mahesh Babu

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం టాలీవుడ్‌లో నెం.1గా ఉన్నాడు.ఈయన ఏ సినిమా చేసినా కూడా 25 కోట్లకు తగ్గకుండా పారితోషికం తీసుకుంటాడు అంటూ ఒక టాక్‌ ఉంది.కొన్ని సినిమాలకు లాభాల్లో షేర్‌తో కలిపి 30 నుండి 40 కోట్ల వరకు కూడా మహేష్‌ బాబు తీసుకుంటున్నాడు.

Mahesh Family Act In Sai Surya Developers Ad

ఇంతటి భారీ ఆదాయం ఉన్న మహేష్‌ బాబు మరో వైపు లెక్కకు మించిన కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ సంవత్సరంకు దాదాపుగా 50 కోట్ల మేరకు సంపాదిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

  మహేష్‌బాబు సంపాదన కేవలం సినిమాలు మరియు బ్రాండ్‌ అంబాసిడర్‌గానే 100 కోట్లకు మించి సంపాదిస్తున్నాడు.ఇంకా ఆయనకు లెక్కకు మించి బిజినెస్‌లు ఉన్నాయి.వాటితో కూడా సంపాదన లెక్కకు మించి వస్తుంది.

డబ్బు కోసం మహేష్‌ భార్య పిల్లలను కూడా రంగంలోకి దించాడు-Movie-Telugu Tollywood Photo Image

ఇంత భారీ ఆదాయం ఉన్నా కూడా తన భార్య పిల్లలను వినియోగించి మరింత సంపాదించాలని మహేష్‌బాబు భావిస్తున్నాడు అంటూ యాంటీ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.సాయి సూర్య డెవలపర్స్‌ కోసం మహేష్‌ బాబు తన ఫ్యామిలీని అంతా రంగంలోకి దించాడు.

  మహేష్‌ బాబు ఆయన భార్య నమ్రత ఇద్దరు పిల్లలు సితార గౌతమ్‌ లు కలిసి ఈ యాడ్‌లో నటించాడు.30 సెకన్ల ఈ యాడ్‌ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ యాడ్‌ విషయం ఏమో కాని మహేష్‌బాబు నలుగురిని కలిసి ఇలా చూస్తే కన్నుల పండుగగా ఉందని, మహేష్‌ బాబు డబ్బుల కోసం కాదు సరదాగా మరియు అభిమానుల కోసం ఫ్యామిలీ అంతా కలిసి యాక్ట్‌ చేయించాడు అంటూ ఫ్యాన్స్‌ వివరణ ఇస్తున్నారు.

 

మరికొందరు సాయి సూర్య డెవలపర్స్‌లో మెజార్టీ వాటాను మహేష్‌బాబు కలిగి ఉన్నాడని, అందుకే తన ఫ్యామిలీ అంతా కలిసి ఈ యాడ్‌లో నటించారని అంటున్నారు.మొత్తానికి ఈ యాడ్‌ చాలా వైరల్‌ అవుతోంది.

#Mahesh Family

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Family Act In Sai Surya Developers Ad Related Telugu News,Photos/Pics,Images..