మహేష్ ప్రేమను చూపించడు.. అన్ని మనసులోనే దాచుకుంటాడు: మంజుల

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది వారసులు వారసురాళ్లు తమ నటన వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఈ క్రమంలోని సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా మహేష్ బాబుతో పాటు మంజుల కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

 Mahesh Doesnt Show Love He Hides It All In His Heart Manjula,  Mahesh Babu, Manj-TeluguStop.com

అయితే ఈమె పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేదు.ఈ క్రమంలోనే నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మిస్తున్నారు.

ఇక ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.తాజాగా తన తమ్ముడు మహేష్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ మహేష్ బాబు ఏ విషయాన్ని బయటకు ఎక్స్ ప్రెస్ చెయ్యరని ఏదైనా తన మనసులోనే దాచుకుంటారని మంజుల వెల్లడించారు.కనీసం ఇతరులపై తన ప్రేమను కూడా బయటికి చెప్పరని మంజుల వెల్లడించారు.

ఇక తన పుట్టినరోజు తనకు ఫోన్ చేసి కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పడు ఈరోజు ప్లాన్స్ ఏంటి అని అడుగుతారే తప్ప శుభాకాంక్షలు మాత్రం చెప్పరని అయితే ఆరోజు తప్పకుండా ఫోన్ చేస్తారని మంజుల తెలిపారు.

Telugu Mahesh Babu, Manjula, Mother Indira, Tollywood-Movie

ఇక ఈ విషయం గురించి తన తల్లి ఇందిర సైతం ఎన్నోసార్లు మహేష్ ఏ విషయాన్ని అలాగే తన ప్రేమను కూడా బయటకు చెప్పడని తన తల్లి ఎప్పుడు చెబుతూ ఉండేది అంటూ ఈమె తెలిపారు.ప్రస్తుతం మహేష్ బాబు గురించి మంజుల చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతున్నారు.తాజాగా ఈయన సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకోగా.తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube