దాంట్లో మహేష్ హస్తం లేదు

వాణిజ్య ప్రకటనలు అంటే దక్షిణాదిలో గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు.మిగితా హీరోలు ఒకటి రెండు బ్రాండ్ లతో సంతృప్తి పడుతోంటే మహేష్ ఏకంగా 15 కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్నాడు.

 Mahesh Didn’t Recommend Sudheer For Halls Brand-TeluguStop.com

మహేష్ పాపులారిటికి ఈ బ్రాండ్లు కుడా ఒక కారణం.

ఇక విషయంలోకి వెళ్తే, మహేష్ బాబు బావ, యువహీరో సుధీర్ బాబుని “హాల్స్” కంపెని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది.

ఇటివలే ఆ యాడ్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటిలో షూట్ చేసారు.ఈ విషయంపై వచ్చిన గాస్సిప్ ఏమిటంటే, సుధీర్ కి ఈ ఆఫర్ మహేష్ వల్లే వచ్చిందని, మహేష్ తన బావను రికమెండ్ చేసాడని.

అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు.

హాల్స్ కి కావాల్సింది, ఫిజిక్ బాగా ఉన్న హీరో.

పైగా సుధీర్ ఇప్పుడు బాలివుడ్ సినిమా చేస్తున్నాడు, ఇక ముందు కుడా చేస్తాడు, సుధీర్ ప్రొఫైల్ ని బాగా గమనించి, సర్వే చేసి ఆ కంపెని సుధీర్ వైపు మొగ్గు చూపింది.మరి సుధీర్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తన బావలా పాపులర్ అయిపోతాడేమో చూడాలి !

సుధీర్ నటించిన భలే మంచి రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తీ చేసుకుంది.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube