మహేష్‌, చైతూ సతీసమేతంగా దానికోసం ప్రచారం  

Mahesh Chaitanya Couples Ariel Ad - Telugu Ariel Washing Powder, Brand Ambasaddor, Mahesh Babu, Naga Chaitanya, Namrata Shirodkar, Samantha

టాలీవుడ్‌ స్టార్స్‌ ఈమద్య కాలంలో చాలా కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.ముఖ్యంగా మహేష్‌బాబు డజన్‌ కంపెనీలను ప్రమోట్‌ చేస్తూ ప్రతి ఏడాది వందల కోట్ల పారితోషికంను పొందుతున్నాడు.

 Mahesh Chaitanya Couples Ariel Ad

సినిమాల ద్వారా ఏ స్థాయిలో పారితోషికం వస్తుందో అంతకు మించి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంటే మహేష్‌కు దక్కుతున్నాయి అనడంలో సందేహం లేదు.ఇంకా కొందరు స్టార్స్‌ కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా చాలా సంపాదిస్తున్నారు.

తాజాగా మహేష్‌బాబు మరియు నమ్రత శిరోద్కర్‌ ఇంకా నాగచైతన్య మరియు సమంతలు కలిసి ఏరియల్‌ వాషింగ్‌ పౌడర్‌ ను ప్రమోట్‌ చేస్తున్నారు.ఈ రెండు జంటలు ఒకే బ్రాండ్‌కు అంబాసిడర్స్‌గా వ్యవహరించడం ఇదే ప్రథమం.

మహేష్‌, చైతూ సతీసమేతంగా దానికోసం ప్రచారం-Movie-Telugu Tollywood Photo Image

మహేష్‌బాబు నమ్రతలు గతంలో స్క్రీన్‌పై పెద్దగా కనిపించింది లేదు.ఇప్పుడు దీని కోసం వీరిద్దరు కనిపిస్తున్న కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఇక యంగ్‌ కపుల్‌ అయిన నాగచైతన్య మరియు సమంతలు కూడా ఏరియల్‌ యాడ్‌ చేయడం ఆకర్షిస్తోంది.

ఈ రెండు జంటల ప్రమోషన్‌తో ఏరియల్‌ లిక్విడ్‌కు విపరీతమైన ప్రమోషన్‌ దక్కింది.తెలుగు రాష్ట్రాల్లో వీటి సేల్‌ కూడా భారీగా పెరుగుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.ఈ రెండు జంటలు మళ్లీ మళ్లీ యాడ్స్‌ లో నటించాలని అంతా కోరుకుంటున్నారు.

ఇక ఈ రెండు జంటలను వెండి తెరపై కూడా చూస్తే కన్నుల పండుగ.కాని నాగచైతన్య మరియు సమంత మాత్రమే కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు.మహేష్‌ నమ్రతలు మళ్లీ కలిసి నటించే ఆసక్తి చూపడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test