సూపర్ స్టార్ మహేష్ చేతికి మరో బ్రాండ్ వచ్చి చేరింది.ప్రముఖ మొబైల్ రీటైల్ సేల్స్ కంపెనీ బిగ్ సికి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ ఉంటున్నారు.
దీనికి సంబందించిన అగ్రిమెంట్, ప్రెస్ మీట్ శుక్రవారం సాయంత్రం జరిగింది.సౌత్ లో వాణిజ్య ప్రకటనలలో సత్తా చాటుతున్న స్టార్ ఆ మహేష్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు.
బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా మహేష్ యాడ్స్ ఉంటాయి.ఇప్పటికే మహేష్ ఖాతాలో చాలా ప్రకటన్లు ఉండగా లేటెస్ట్ గా ఆ లిస్ట్ లో బిగ్ సి కూడా చేరింది.
ప్రముఖ మొబైల్ రిటైల్ కంపెనీ బిగ్ సి తమ బ్రాండ్ అంబాసిడర్ గా కొత్తగా మహేష్ ను ఎంపిక చేసుకున్నారు.ఈ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నందుకు మహేష్ కు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.
మహేష్ బ్రాడింగ్ చేస్తే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది.అందుకే మహేష్ తోనే తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
బిగ్ సి బ్రాండ్ కు కొత్త అంబాసిడర్ గా మహేష్ తన సత్తా చాటనున్నాడు. ఇప్పటికే పదుల సంఖ్యలో బ్రాండ్ లను ప్రమోట్ చేస్తున్న మహేష్ కొత్తగా బిగ్ సి మొబైల్స్ ను ప్రమోట్ చేసేందుకు సై అన్నారు.