65 కోట్లు ఖర్చు పెడితే 5 కోట్లు కలెక్ట్ చేసిన సడక్ 2

కొన్ని సినిమాలు ఎంత దారుణంగా డిజాస్టర్ అవుతూ ఉంటాయంటే పెట్టిన పెట్టుబడిలో సగం కలెక్షన్స్ కూడా రావడం కష్టం అయిపోతుంది.అయితే తక్కువ బడ్జెట్ తో తీసే సినిమాల విషయంలో ఫ్లాప్ అయిన కొంత వరకు సేఫ్ అవ్వొచ్చు.

 Sadak 2 Movie Financial Loss Approx 60 Crores, Sanjay Dutt, Aliya Bhatt, Mahesh-TeluguStop.com

కాని భారీ బడ్జెట్ తో తీసే సినిమాలు

డిజాస్టర్

అయితే మాత్రం ఆ నిర్మాతలు కోలుకోవడం చాలా కష్టం అవుతుంది.తెలుగులో శక్తి సినిమాతో వచ్చిన నష్టాల నుంచి కోలుకోవడానికి నిర్మాత అస్వినీదత్ కి చాలా సమయం పట్టింది.

అలాగే బాలకృష్ణ కెరియర్ లో కూడా అలాంటి భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ మిగిల్చిన నష్టాలతో నిర్మాతగా నాగబాబు పూర్తిగా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.

ఆ నష్టాలు పూడ్చడానికి పడ్డ ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇలా నిర్మాతలని నిలువునా ముంచిన సినిమాలు అన్ని భాషలలో ఉంటాయి.

ఇదిలా ఉంటే మహేష్ భట్ దర్శకత్వంలో అలియా భట్, సంజయ్ దత్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో వచ్చిన సినిమా సడక్ 2, ఈ సినిమాని సుమారు 65 కోట్లు పెట్టి డిస్నీ హాట్ స్టార్ కొనుగోలు చేసింది.సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారు అనే విషయం పక్కన పెడితే డిస్నీ కొనుగోలు చేసిన మొత్తం ఈ సినిమాకి ఖర్చు అయినట్లే.

అయితే ఈ సినిమా మీద మొదటి నుంచి సుశాంత్ ఎఫెక్ట్ గట్టిగా ఉంది.సినిమాకి సంబందించిన పోస్టర్ నుంచి రిలీజ్ వరకు సినిమా మీద నెగిటివ్ వైబ్ క్రియేట్ చేయడంలో సుశాంత్ ఫ్యాన్స్ సక్సెస్ అయ్యారు.

అయినా కాని డిస్నీ హాట్ స్టార్ట్ ధైర్యం చేసి సినిమాని కొనేసింది.అయితే సినిమా రిలీజ్ తర్వాత సాదాసీదా కథగా సినిమా తేలిపోవడంతో పాటు సుశాంత్ ఫ్యాన్స్ చేసిన నెగిటివ్ ప్రమోషన్ తో ఊహించని స్థాయిలో డిజాస్టర్ గా మారిపోయింది.

ఇండియా సినిమా చరిత్రలోనే అత్యంత చెత్త సినిమా రికార్డులు క్రియేట్ చేసింది.ఇక డిస్నీ వాళ్ళు దీనిపై 65 కోట్లు పెడితే కేవలం ఐదు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

ఈ స్థాయిలో ఎఫెక్ట్ సదరు ఓటీటీ సంస్థకి భారీ నష్టం అని చెప్పాలి.అయితే డిస్నీ లాంటి పెద్ద పేరున్న కంపెనీ కాబట్టి ఈ నష్టాన్ని తట్టుకోగలదు.

ఇకపై సినిమాలు కొనే విషయంలో ఓటీటీ సంస్థలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేలా సడక్ 2 చేసిందని చెప్పాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube