నా 50 ఏండ్లు ఒక ఎత్తు.. నా కూతురు 2 ఏండ్లు మరోఎత్తు.. అలియాపై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

మహేష్ భట్. హిందీ చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు.

 Mahesh Bhatt About Alia Bhatt Money Earning Details, Alia Bhatt, Mahesh Bhatt, A-TeluguStop.com

దిగ్గజ దర్శకుడిగా, తిరుగులేని ప్రొడ్యూసర్ గా ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు.బాలీవుడ్ టాప్ సెలబ్రిటీ అయిన మహేష్ భట్ నట వారసురాలిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఆయన కూతురు అలియా భట్. చాలా అంటే చాలా తక్కువ కాలంటోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది.అంతేకాదు.

భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటూ కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే తండ్రిని మించి పోయింది.

అలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతోంది.

ఈ ముద్దుగుమ్మ ముందుగా చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత 2012లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

స్టూడెంట్ అఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.తన తొలి సినిమాతోనే కనీ వినీ ఎవరుగని రీతిలో విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో తన అసమాన నటనతో అదుర్స్ అనిపించింది.మొత్త 10 సంవత్సరాల సినీ కెరీర్ లో సుమారు 15 సినిమాలు చేసింది.

ప్రస్తుతం ఆమె 5 సినిమాలు చేస్తుంది.వాటిలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ తను నటిస్తుంది.

Telugu Alia Bhatt, Aliabhatt, Bollywood, Mahesh Bhatt, Maheshbhatt, Rajamouli, R

అలియా భట్ తక్కువ సమయంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది.తండ్రికి మించిన కూతురుగా మారిపోయింది.ఇక సంపాదన విషయంలో తండ్రికి మించిపోయింది.ఆమెను చూసి తండ్రి చాలా మురిసిపోతున్నాడు.తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమెకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.

Telugu Alia Bhatt, Aliabhatt, Bollywood, Mahesh Bhatt, Maheshbhatt, Rajamouli, R

సినిమా రంగమే కాదు.ఎక్కడ రాణించాలన్నా టాలెంట్ అనేది చాలా ముఖ్యం అన్నాడు.కొంత మంది చిన్నతనంలోనే అద్భుత టాలెంట్ తో ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నట్లు చెప్పాడు.తన కూతురు కూడా అలాగే ముందుకు సాగుతున్నట్లు చెప్పాడు.50 ఏండ్లలో తను సంపాదించిన సంపాదన కంటే రెండేళ్లలో తన కూతురు సంపాదించిన సంపాదన ఎక్కువ అంటూ పొంగిపోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube