మహేష్‌ టోటల్‌ ఫ్యామిలీ కలిసి నటించబోతున్నారు  

Mahesh Babu Total Family In One Frame in the Ad - Telugu Gaoutham, Mahesh Babu, Mahesh Babu Ad Film, Namratha, Sithara, Tollywood Box Office, Tollywood Gossips

టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఫ్యామిలీకి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరి గురించి సోషల్‌ మీడియాలో చాలా తరుచుగా విషయాలు వైరల్‌ అవుతూ ఉంటాయి.

Mahesh Babu Total Family In One Frame In The Ad

మహేష్‌ బాబు కూతురు సితార ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తూ ఉండగా, ఇక మహేష్‌ బాబు తనయుడు గౌతమ్‌ ఇప్పటికే ఒక సినిమాలో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకున్నాడు.ఇక చివరగా మహేష్‌బాబు భార్య నమ్రత హీరోయిన్‌గా ఎప్పుడో ఆమె స్టార్‌ అయ్యింది.

ఈ నలుగురు ఒక ఫొటోలో కనిపిస్తేనే ఫ్యాన్స్‌ సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు.అలాంటిది వీరు నలుగురు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనే అసలు ఊహకు అందండం లేదు కదా.త్వరలో వీరు నలుగురు కలిసి నటించబోతున్నారు.సినిమాకు అయితే కాదు లే కాని ఒక యాడ్‌ కోసం మహేష్‌ బాబు ఫ్యామిలీ మెంబర్స్‌ నలుగురు కలిసి నటించబోతున్నారు.

మహేష్‌ టోటల్‌ ఫ్యామిలీ కలిసి నటించబోతున్నారు-Movie-Telugu Tollywood Photo Image

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ యాడ్‌లో మహేష్‌ ఫ్యామిలీ కనిపిస్తారని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

  ఆ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో మహేష్‌బాబు ఫ్యామిలీకి మెజార్టీ వాటా ఉందని, అందుకే ఫ్యామిలీతో కలిసి నటించేందుకు ఓకే చెప్పాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది.అతి త్వరలోనే ఆ యాడ్‌ షూట్‌ పూర్తి అయ్యి బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించబోతుంది.దాదాపు పది నిమిషాల యాడ్‌లో నలుగురు కనిపించబోతున్నారు.

నిజ జీవిత పాత్రల్లోనే ఆ నలుగురు కనిపిస్తారని సమాచారం అందుతోంది.ప్రస్తుతం మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

#Sithara #Mahesh Babu #Gaoutham #Namratha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Total Family In One Frame In The Ad Related Telugu News,Photos/Pics,Images..