మ‌హేష్‌కు మ‌రో షాకిచ్చిన బ‌న్నీ..!

టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ వ‌ర్సెస్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు మ‌ధ్య కోల్డ్‌వార్ న‌డుస్తోన్న ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి.ముఖ్యంగా ఈ సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠ‌పురములో, స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాల రిలీజ్ డేట్ల విష‌యంలో ఇద్ద‌రూ పంతానికి పోయిన‌ట్టే క‌నిపించింది.

 Allu Arjun Gave Shock To Mahesh,mahesh Babu,stylish Star,allu Arjun,shock,film,t-TeluguStop.com

ఇద్ద‌రు పోటాపోటీగా రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించుకుని ఎవ్వ‌రూ వెన‌క్కు త‌గ్గ‌లేదు.దీంతో ఈ రెండు ప‌క్క ప‌క్క డేట్ల‌లోనే విడుద‌ల అయ్యాయి.

రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయినా బ‌న్నీ అల వైకుంఠ‌పుర‌ములో సినిమా స‌రిలేరుపై కాస్త పైచేయి సాధించింది. ఈ విష‌యంలో డౌట్ లేదు.

ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడు నెల‌లు దాటుతున్నా ఇంకా రికార్డుల మోత మోగుతూనే ఉంది.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ అందించిన ఆల్బ‌మ్ కూడా సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది.

బ‌న్నీ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కిన ఈ సినిమా మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది.ఆగ‌స్టు 16న జెమినీ ఛానెల్ అల వైకుంఠ‌పుర‌ములో సినిమాను వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్ షోగా ప్ర‌సారం చేసింది.ఈ సినిమాకు ఏకంగా 29.4 టీఆర్పీ రేటింగ్ వ‌చ్చింది.

క‌రోనా కార‌ణంగా ఇంటికే ప‌రిమితం అయిన జ‌నాలు ఈ సినిమాను బుల్లితెర మీద బాగా ఎంజాయ్ చేసిన‌ట్టు తెలుస్తోంది.ఇక ఇప్ప‌టి వ‌ర‌కు టాప్‌లో ఉన్న మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు టీఆర్పీ 23.4 రేటింగ్‌ను బ్రేక్ చేసింది.సంక్రాంతికి మ‌హ‌ష్ మొగుడు.

బ‌న్నీ రంకు మొగుడు అంటూ ఈ రెండు సినిమాలు పోటీ ప‌డ్డాయి. ఈ ప‌దాల‌ను సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రు హీరోల అభిమానులు బాగా ట్రోల్ చేశారు.

చివ‌ర‌కు ఆ పోటీలో అల వైకుంఠ‌పుర‌ములో సినిమా పైచేయి సాధించింది.ఇప్పుడు మ‌ళ్లీ బుల్లితెర‌పై సైతం బ‌న్నీ సినిమాయే పైచేయి సాధించింది.ఇక ఈ రెండు సినిమాల త‌ర్వాత బాహుబలి – 2 22.7 , శ్రీమంతుడు  22.54 టీఆర్పీతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube