పవన్ కళ్యాణ్ నటనపై మహేష్ బాబు వైరల్ కామెంట్.. ఏమన్నాడంటే?

వకీల్ సాబ్ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టిస్తున్నదో మనం చూస్తూనే ఉన్నాం.ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని థియేటర్ లలో బ్లాక్ బస్టర్ టాక్ తో రిపీటెడ్ ఆడియన్స్ తో సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

 Mahesh Babus Viral Comment On Pawan Kalyans Performance What Did He Say-TeluguStop.com

పింక్ సినిమా రీమేక్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మ్యానరిజంకు తోడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత స్వభావం ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పవచ్చు.ఒక వ్యక్తిగా సమస్యలపై స్పందించే లక్షణం ఉన్న పవన్ కళ్యాణ్ ఇటువంటి సినిమా చేయడం పవన్ అభిమానులను గర్వ పడేలా చేసిందనే చెప్పవచ్చు.

ఇప్పటికే ఈ సినిమా పట్ల ఇండస్ట్రీ వర్గాల నుండి వకీల్ సాబ్ టీంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

 Mahesh Babus Viral Comment On Pawan Kalyans Performance What Did He Say-పవన్ కళ్యాణ్ నటనపై మహేష్ బాబు వైరల్ కామెంట్.. ఏమన్నాడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి వకీల్ సాబ్ సినిమాను చూసిన విషయం మనకు తెలిసిందే.

అనంతరం తన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ నటనను, అంజలి, నివేదా థామస్, అనన్యలను సోషల్ మీడియా వేదికగా ప్రశంసించిన విషయం తెలిసిందే.అంతేకాక వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్, ప్రొడ్యూసర్ దిల్ రాజును తన నివాసానికి పిలిపించుకొని అభినందించిన విషయం తెలిసిందే.

అయితే ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరాడు.పవన్ కళ్యాణ్ టాప్ ఫామ్ లో ఉన్నాడని, వకీల్ సాబ్ లో పవన్ నటన భేష్ అని, అదే విధంగా ఈ సినిమాలో నటించిన అంజలి, నివేదా థామస్, అనన్యలను మహేష్ అభినందించారు.

ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.

#Maheshbabu ##VakeelSaab #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు