పవన్ కన్నా 8 కోట్లు ఎక్కువ తీసుకుంటున్న మహేష్ ?

దక్షిణాది కథానాయకుల్లో అత్యధిక సంపాదన గల నటుడు మహేష్ బాబు.ఒకవైపు రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటూనే, డజను బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.

 Mahesh Babu’s Remuneration Is 28cr For Arm Film?-TeluguStop.com

బ్రాండ్లను పక్కనపెట్టినా, రజినీకాంత్ తరువాత అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో మన తెలుగు సూపర్ స్టార్.

ఇన్నిరోజులు మహేష్ – పవన్ రెమ్యునరేషన్ దగ్గర దగ్గరలోనే ఉండేది.

ఇద్దరు దాదాపు ఒకే సమయంలో 15 కోట్ల మార్కు దాటారు.మళ్ళీ 18 కోట్లు ఇద్దరు ఒకే సమయంలో డిమాండ్ చేసారు.

ఆ తరువాత 20 కోట్లు కూడా ఒకే సమయంలో తోసుకోవటం మొదలయపెట్టారు.అయితే పవన్ ఇంకా 20 కోట్ల దగ్గరే ఉండిపోతే, మహేష్ 25 కోట్ల మార్కు దాటేస్తున్నాడు.

బ్రహ్మోత్సవం లాంటి భారి ఫ్లాప్ తరువాత రికార్డు రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడు ప్రిన్స్.మురుగదాస్ దర్శకత్వంలో మొదలుపెడుతున్న సినిమాకి మహేష్ పారితోషికం 25 కోట్లని కొందరు, కాదు 28 కోట్లని మరికొందరు అంటున్నారు.

రెండిట్లో ఏది కరెక్టు అయినా, తెలుగులో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో మాత్రం మహేషే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube