సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ) మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు.అయితే ఈయన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు మహేష్ బాబుకి కూడా హీరోగా మంచి గుర్తింపు అయితే వచ్చింది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం కృష్ణ( Krishna ) ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించాడు.అయితే ఈ పాత్ర కోసం మొదట రాఘవేంద్రరావు ( Raghavendra Rao )నాగేశ్వరరావుని తీసుకుందామనుకున్నాడట.కానీ నాగేశ్వరరావు( Nageswara Rao ) ఈ పాత్రని రిజెక్ట్ చేయడంతో ఇక రాఘవేంద్రరావు కృష్ణ గారితో ఈ సినిమాలో నటింపజేసినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.
ఇక మొత్తానికైతే కృష్ణ ఈ సినిమాలో మహేష్ బాబుకి సపోర్టుగా నటించి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంలో కీలకపాత్ర వహించాడనే చెప్పాలి.ఇక ఈ సినిమాతో మహేష్ బాబుకు వచ్చిన క్రేజ్ ని వాడుకుంటూ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో డైరెక్ట్ గా వరల్డ్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటి వరకు తెలుగులోనే సినిమాలు చేసిన మహేష్ బాబు ఒక్కసారిగా వరల్డ్ సినిమాలోకి ఎంటర్ అవ్వడం ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయమనే చెప్పాలి…ఇక ఈ సినిమాతో అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు ఇద్దరు వరల్డ్ సినిమాలో మన సినిమాను నిలపబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే మన తెలుగు సినిమా వరల్డ్ లెవల్లో వస్తున్నందుకు తెలుగు వాళ్ల మైన మనం గర్వపడాలి…
.