ఏఎంబీ సినిమాలో మహేష్‌ చాలా తక్కువ? ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!  

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తాజాగా ఏషియన్‌ సునీల్‌తో కలిసి ఏఎంబీ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే. మొదట ఈ మల్టీప్లెక్స్‌ పూర్తిగా మహేష్‌బాబుది అనుకున్నారు. కాని ఏషియన్‌ సునీల్‌తో కలిసి మహేష్‌బాబు దీనిని నిర్మించాడని వార్తలు వచ్చాయి. మల్టీప్లెక్స్‌ పేరు కూడా ఏఎంబీ అని ఉండటంతో మహేష్‌బాబుకు ఎక్కువ శాతం వాటా ఉండి ఉంటుందని అంతా భావించారు. లేదంటే సునీల్‌ మరియు మహేష్‌ లు సగ భాగం వాటాలు కలిగి ఉండొచ్చు అంటూ కొందరు అనుకున్నారు.

Mahesh Babu's Law Partnership In AMB Cinemas-Mahesh Babu Percentage Amb Cinimas

Mahesh Babu's Law Partnership In AMB Cinemas

నిన్న ఏఎంబీ ప్రారంభం అయిన తర్వాత అసలు విషయం వెళ్లడయ్యింది. ఈ మల్టీప్లెక్స్‌లో కేవలం 20 శాతం వాటాను మాత్రమే మహేష్‌బాబు కలిగి ఉన్నాడని అంటున్నారు. మహేష్‌బాబు వాటాతో పాటు ఇంకా అందులో నలుగురి వాటాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆ మల్టీప్లెక్స్‌లో మొత్తం ఏడు స్క్రీన్స్‌ ఉండగా, అందులో రెండు పూర్తిగా మహేష్‌బాబు సొంతం కాగా ఇతర స్క్రీన్స్‌లో కొంత భాగం షేర్‌ ఉందని తెలుస్తోంది. మహేష్‌బాబు భారీగానే సంపాదిస్తున్నాడు కదా, మరి ఎందుకు అంత తక్కువ శాతం వాటాను కొనుగోలు చేశాడంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Mahesh Babu's Law Partnership In AMB Cinemas-Mahesh Babu Percentage Amb Cinimas

ఇక మహేష్‌బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన ‘మహర్షి’ చిత్రాన్ని చేస్తున్నాడు. మరో వైపు సుకుమార్‌ దర్శకత్వంలో సినిమాకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. 2020వ సంత్సరం వరకు మహేష్‌ బాబు వరుసగా సినిమాలు చేసేందుకు ఇప్పటికే కమిట్‌ అయ్యాడు. మహర్షి చిత్రంతో వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. రికార్డు స్థాయిలో మహర్షి బిజినెస్‌ జరుగుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది.