సోలోగా ట్రై చేశా ఇంకొకటి చేయమంటారా.. సితార డాన్స్ వీడియో వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయనకు సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Mahesh Babu Daughter Sithara Dance Video Goes Viral Details, Mahesh Babu, Sitra-TeluguStop.com

ఇకపోతే మహేష్ బాబు గారాల పట్టి సితార కూడా సోషల్ మీడియాలో అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.సితార ఇంత చిన్న వయసులోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే సితార తాజాగా ఒక వీడియోని షేర్ చేశారు.ఫాస్ట్ బీట్ తో సాగిపోయే ఒక వెస్ట్రన్ పాటకు సితార ఎంతో అద్భుతంగా స్టెప్పులు వేశారు.

ఈ వీడియోను సితార సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సోలోగా ట్రై చేశాను.ఇంకొకటి చేయమంటారా? అంటూ ట్యాగ్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉండగా ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కొందరు సితార డ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్ చేయగా.మరికొందరు సితార అప్ కమింగ్ హీరోయిన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమా అనంతరం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube