ఆర్ఆర్ఆర్‌లో మహేష్, అమితాబ్.. కాస్కోండి!

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తు్న్నారు.

 Mahesh Babuamitab Bachchan Voiceover For Rrr-TeluguStop.com

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తున్న ఈ సినిమాను చూసేందుక అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తు్న్నాడు జక్కన్న.

కాగా ఈ సినిమాలో అందరినీ అవాక్కయ్యే అంశం ఉందని చిత్రపురిలో తాజాగా ఓ వార్త వినిపిస్తోంది.

ఈ మెగా మల్టీస్టారర్ మూవీలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ బిగి బి అమితాబ్ బచ్చన్‌లు కూడా ఉన్నారట.

అయితే వారు స్క్రీన్‌‌పై మనకు కనిపించరట.ఈ సినిమాకు తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు మహేష్ ఓకే చెప్పినట్లు, బాలీవుడ్‌లో అమితాబ్ వాయిస్ ఓవర్ ఇస్తారని తెలుస్తోంది.

గతంలో మహేష్ బాబు పవర్ స్టార పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ వార్తతో మహేష్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియాలోని బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీల తమ అభిమాన హీరో కూడా పాల్గొంటున్నందుకు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఫారిన్ బ్యూటీ ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ కూడా నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube