మహేష్ బాబు ఎత్తుకున్న ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్.. ఆమె ఎవరో గుర్తుపట్టారా?

సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు చైల్డ్ ఆర్టిస్టులు గానే మిగిలిపోకుండా హీరో హీరోయిన్ల వరకు తమ పరిచయాన్ని పెంచుకుంటున్నారు.చాలా వరకు ఇప్పుడున్న హీరో హీరోయిన్లు అంతా ఒకప్పుడు బాలనటులుగా అడుగుపెట్టిన వాళ్లే.

 Mahesh Babu Yuvaraju Child Artist Sri Divya Details, Mahesh Babu, Tollywood, Yuv-TeluguStop.com

అలా బాలనటులుగా అడుగుపెట్టి చివరికి హీరో హీరోయిన్గా ఎదిగే స్థాయికి చేరుకుంటారు.

ఇక కొందరు మాత్రం స్టార్ పొజిషన్ కి కూడా చేరుకున్నారు.

ఇప్పుడొస్తున్న బాలనటులు కూడా భవిష్యత్తులో హీరో హీరోయిన్లుగా అవ్వడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.ఇదంతా పక్కన పెడితే.

ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ఫోటోలో మహేష్ బాబు ఒక చిన్నారిని ఎత్తుకొని ఉన్నాడు.ఇక ఈ చిన్నారి ఇప్పుడు ఒక హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

ఇక ఆమె ఫేస్ చూడగానే ఆమె ఎవరో వెంటనే కనిపెట్టవచ్చు.మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాలో బాలనటిగా నటించిన ఈ ముద్దుగుమ్మ.ఇప్పటికీ ఈ హీరోయిన్ ఇంకా గుర్తుపట్టలేదా.అదేనండోయ్ మనసారా సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన శ్రీదివ్య.

బాగా గమనించినట్లయితే ఆమె అమాయకత్వపు ముఖాన్ని సులువుగా గుర్తుపట్టవచ్చు.

మహేష్ బాబు సినిమాలను నటిస్తున్న సమయంలో అంత చిన్నగా ఉన్న శ్రీదివ్య ఇప్పుడు మహేష్ బాబు సరసన నటించేంత వయసుకు ఎదిగింది.

శ్రీదివ్య 2000 సంవత్సరంలో మూడేళ్ళ వయసు నుండే తన నటన జీవితాన్ని ప్రారంభించింది.చిన్న వయసులోనే తెలుగులో పలు సినిమాలలో నటించింది.తన నటనకు బాలనటిగా నంది అవార్డు కూడా గెలుచుకుంది.

Telugu Bus, Sri Divya, Mahesh Babu, Mahesh Vintage, Manasara, Tollywood, Yuvaraj

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించింది శ్రీదివ్య.మొదట్లో తెలుగు టి.వి.సీరియల్స్ లో నటించింది శ్రీ దివ్య. ఆ తర్వాత 2010లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మనసారా సినిమాలో తొలిసారిగా హీరోయిన్ గా నటించింది.

ఆ తరువాత 2012లో మారుతి దర్శకత్వంలో వచ్చిన బస్ స్టాప్ సినిమాలో నటించింది.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

అలా వరుసగా పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా ఎందుకో అంతగా గుర్తింపు సొంతం చేసుకోలేకపోయింది.ఇక ఈ ఏడాది జనగణమన మలయాళం సినిమాలో అతిథి పాత్రలో నటించింది.

ఇక ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది.

Telugu Bus, Sri Divya, Mahesh Babu, Mahesh Vintage, Manasara, Tollywood, Yuvaraj

నిత్యం సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ షేర్ చేసుకుంటుంది.చాలా వరకు నేచురల్ గా కనిపిస్తుంది.ఎప్పుడు కూడా పద్దతికరమైనా దుస్తువులు ధరించింది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా బాగా ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు కొన్ని కొటేషన్స్ కూడా షేర్ చేసుకుంటూ అందరిని కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.

ఇక ప్రస్తుతం మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది.కానీ అంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది.ఇక ఈ నేచురల్ బ్యూటీ కి అవకాశాలు రాకపోవడంతో తన అభిమానులు ఎప్పుడు అవకాశాలు వస్తాయో అని ఎదురుచూస్తున్నారు.ఇక ఇప్పటికైనా ఈ ముద్దుగుమ్మ కు అవకాశాలు వస్తాయో రావో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube