మహేష్ వల్ల ఏడవాలి

హెడింగ్ చూసి ఏంటి మహేష్ బాబు మళ్ళీ ఫ్లాప్ ఇస్తున్నాడా .ఆగడు,1 చిత్రాలకి ఏడ్చినట్టుగా నిర్మాతలు, డిస్ట్రీబ్యూటర్స్, అభిమానులు మళ్ళీ ఏడవాల్సిందేనా అని కంక్లూజన్ కి వచ్చేయకండి.

 Mahesh Babu Will Make You Cry In Brahmotsavam-TeluguStop.com

మహేష్ ఏడిపించనున్నాడు .కాని బాక్సాఫీస్ ఫలితంతో కాదు .తన నటనతో.

ఇటివలే బ్రహ్మోత్సవం చిత్రానికి సంబంధించి క్లయిమాక్స్ లో వచ్చే కీలక సన్నివేశం ఒకటి షూట్ చేసారంటా.

అందులో మహేష్ నటన అత్యాద్భుతః అంటున్నారు యూనిట్ మెంబర్స్.కుటుంబ విలువలు, అనుబంధాలను ప్రేమించే ఏ వ్యక్తి అయినా, ఆ సన్నివేశాన్ని, అందులో మహేష్ బాబు అద్భుత నటనను చూసి కంటతడి పెట్టుకోకుండా ఉండలేరట.

సూపర్ స్టార్ అలా ఏడిపిస్తే బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలి ఆడియెన్స్ నిరాజనాలు పలకడం, బ్రహ్మోత్సవం బ్రహ్మాండమైన హిట్ గా నిలవడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు మహేష్ అభిమానులు.

ఇటివలే హైదరబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న బ్రహ్మోత్సవం ప్రస్తుతం ఉత్తర భారతంలో షూటింగ్ జరుపుకుంటోంది.

అన్ని అనుకున్నట్టుగానే జరిగితే ఏప్రిల్ 29నే బ్రహ్మోత్సవం విడుదల అవడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube