ఆ గ్యాప్‌ లో మహేష్‌ రెండు మూడు సినిమాలు చేసుకోవచ్చు

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడు అంటే ఎక్కువ మంది రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ సినిమాను చేయబోతున్నాడు అంటూ చెబుతారు.కాని రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ఏకంగా సంవత్సరంకు పైగా గ్యాప్ తీసుకుంటాడని అంటున్నారు.

 Mahesh Babu Will Do 3 More Movies Before Rajamouli Movie-TeluguStop.com

ఆ గ్యాప్‌ లో మహేష్‌ బాబు సినిమా కోసం 10 నుండి 12 నెలల పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ను చేయబోతున్నాడు.చివరి నాలుగు అయిదు నెలల ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ లో మహేష్‌ బాబు కూడా పాల్గొనాల్సి ఉంటుందని సమాచారం.

అంటే రాజమౌళితో మహేష్‌ బాబు కలిసేందుకు ఇంకా ఎంత లేదన్నా ఏడాదిన్నర సమయం పడుతుంది.వీరి కాంబో మూవీ పట్టాలెక్కేది 2023లో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

 Mahesh Babu Will Do 3 More Movies Before Rajamouli Movie-ఆ గ్యాప్‌ లో మహేష్‌ రెండు మూడు సినిమాలు చేసుకోవచ్చు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కనుక మహేష్‌ బాబు సర్కారు వారి పాట తర్వాత రాజమౌళి సినిమా కోసం వెయిట్‌ చేస్తూ ఉండక పోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి ద్వార సమాచారం అందుతోంది.

సర్కారు వారి పాట సినిమా ఈ ఏడాది ఆగస్టు వరకు షూటింగ్ పూర్తి అవుతుందని అంటున్నారు.

కనుక సర్కారు వారి పాట సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం సెప్టెంబర్‌ లేదా అక్టోబర్ లో అనీల్ రావి పూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తాడని అంటున్నారు.సరిలేరు నీకెవ్వరు సినిమా తో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న మహేష్‌ బాబు ఆ సినిమా కు దర్శకత్వం వహించిన అనీల్‌ రావి పూడితో మరో సినిమాను చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఎఫ్‌ 3 పూర్తి అవ్వడమే ఆలస్యం మహేష్‌ బాబు సినిమా పనిలో అనీల్‌ పడబోతున్నాడని అంటున్నారు.అనీల్ రావిపూడి మూవీ మాత్రమే కాకుండా మరో సినిమా లేదా రెండు సినిమా లను కూడా మహేష్‌ చేసేంత సమయం ఉంటుంది.కనుక జక్కన్న తో మహేష్‌ బాబు చేయబోతున్న సినిమా వచ్చే వరకు మహేష్‌ బాబు రెండు మూడు సినిమాలు విడుదల చేస్తాడని అంటున్నారు.

Telugu Anil Ravipudi, Mahesh Babu, Pre Production Work, Rajamouli, Rrr, Sarkaru Vaari Pata Movie, Telugu Film News, Tollywood-Movie.

#Anil Ravipudi #Mahesh Babu #SarkaruVaari #Rajamouli #PreProduction

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు