మహేష్ భార్య ఆల్ టైం ఫేవరెట్ మూవీ ఏంటంటే..?  

mahesh babu wife all time favoruite movie is okkadu, 18 years, all time favoueite movie, mahesh babu , okkadu - Telugu 18 Years, All Time Favoruite Movie, Mahesh Babu, Okkadu

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి.మహేష్ అభిమానులు ఎక్కువగా ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలను తమ ఫేవరెట్ సినిమాలని చెబుతున్నారు.

TeluguStop.com - Mahesh Babu Wife All Time Favoruite Movie Is Okkadu

ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో పాటు కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.కొందరు అభిమానులు మాత్రం మహేష్ నటించిన నిజం, బిజినెస్ మేన్, ఖలేజా, 1 నేనొక్కడినే సినిమాలు తమ ఫేవరెట్ సినిమాలని చెబుతారు.

మరి మహేష్ బాబు భార్య నమ్రతకు ఫేవరెట్ సినిమా ఏమిటి.? అనే ప్రశ్నకు నమ్రతే స్వయంగా సమాధానం చెప్పేశారు.మహేష్ బాబు ఒక్కడు సినిమా విడుదలై నిన్నటికి 18 సంవత్సరాలైంది.గుణశేఖర్ డైరెక్షన్ లో మహేష్ బాబు, భూమిక ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కగా ప్రకాష్ రాజ్ విలన్ పాత్రల్లో నటించారు.2003 సంవత్సరం జనవరి 15వ తేదీన ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ఫలితాన్ని సొంతం చేసుకుంది.

TeluguStop.com - మహేష్ భార్య ఆల్ టైం ఫేవరెట్ మూవీ ఏంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

దర్శకుడు గుణశేఖర్, హీరో మహేష్ బాబు కెరీర్ లలో ఒక్కడు సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది.మహేష్ బాబు భార్య ఒక్కడు సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా తన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఒక్కడు సినిమా ఇతర భాషల్లో రీమేక్ కాగా అక్కడ కూడా సక్సెస్ కావడం గమనార్హం.

మొదట ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నా చివరకు ఒక్కడు టైటిల్ ను దర్శకనిర్మాతలు ఫిక్స్ చేశారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఛార్మినార్ సెట్ కోసం నిర్మాత ఎం.ఎస్ రాజు ఏకంగా కోటీ 70 లక్షల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం.పెట్టిన ఖర్చుకు తగిన ఫలితం సినిమా రిజల్ట్ రూపంలో దక్కింది.

ఈ సినిమా కోసం మహేష్ కబడ్డీ ఆటను నేర్చుకోవడం గమనార్హం.

#Okkadu #18 Years #AllTime #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు