ఆ బాలివుడ్ హీరోలాగా మారాలనుకుంటున్న మహేష్     2016-12-23   23:05:29  IST  Raghu V

బాలివుడ్ హీరోల్లో ఆమీర్ ఖాన్ రూటే వేరు. ఎప్పుడు ఎలాంటి సినిమా చేస్తాడో. ఎలాంటి పాత్ర చేస్తాడో ముందే కనిపెట్టడం దాదాపు అసాధ్యం. ఈ కథతో కూడా సినిమా తీయవచ్చా అనేలా చేస్తాడు. స్టార్ డమ్ ని పట్టించుకోడు. విభిన్న కథలు, విభిన్న పాత్రలు .. ప్రయోగాలు చేసినా, రికార్డులన్ని తనవే.

అచ్చం ఆమీర్ లాగే, మహేష్ మారిపోవాలని అనుకుంటున్నాడట. ఎంతసేపు, అవే ఫైట్లు, అవే పాటలు అనే గోలలో పడిపోకుండా, కొత్తరకమైన సినిమాలు చేయాలని, ఆమీర్ ఖాన్ మాదిరి కథాబలం ఉన్న చిత్రాల్లో నటించాలని మహేష్ కి కోరిక అంట. అయినా, చేయలేకపోతున్నాడట. ఈ విషయాల్ని నిన్న దర్శకుడు జయంత్ సీ పరాన్జీ ఒక షోలో బయటపెట్టారు.

మరి మహేష్ ఆమీర్ ఖాన్ లాంటి సినిమాలు ఎందుకు చేయట్లేదు? అభిమానులు, తెలుగు ప్రేక్షకులలో మహేష్ ని ఆరకంగా చూసే మార్పు రాకపోవడమే కారణం కావచ్చు. తన ఇమేజ్ వేరు, చేయాలనుకుంటున్న సినిమాలు వేరు. మహేష్ కి సూపర్ స్టార్ అనే ట్యాగ్ బరువుగా అనిపిస్తుందేమో !