అయ్యో... మహేష్ సినిమా హిట్ అయినా కూడా డబ్బులు రాలేదటగా...

ప్రస్తుతం నెట్టింట్లో మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.ఇందులో భాగంగా  తాజాగా విడుదలైనటువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రం కొన్నిచోట్ల సరైన వసూళ్లు రాబట్టి లేదని దాంతో అక్కడ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు చాలానే నష్టపోయారని పలు వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

 Mahesh Babu Vijayashanthi Sarileru Nikevvaru Anil-TeluguStop.com

అంతేగాక ఇలా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడం కొత్తేమీ కాదని గతంలో వచ్చినటువంటి మహర్షి, భరత్ అనే నేను, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అతడు, వంటి చిత్రాల విషయంలో కూడా ఇలాగే జరిగిందని అంటున్నారు.

కానీ నీ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ లాభాల విషయంలో కొన్ని చిత్రాలు మాత్రమే బోల్తా పడ్డాయని, మిగిలిన చిత్రాలు బాగానే కాసుల వర్షం కురిపించినట్లు ఆ చిత్ర యూనిట్ సభ్యులు కూడా అధికారికంగా తెలిపారని అంటున్నారు.

అయితే ప్రస్తుతం ఈ సరిలేరు నీకెవ్వరు చిత్రం వసూళ్ల విషయమై నో బ్రేక్ ఈవెన్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనే హాష్ ట్యాగ్ తో నేషనల్ లెవల్లో ట్రెండ్ అవుతుంది.ఇవన్నీ మహేష్ బాబు అంటే గిట్టని వారు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని మహేష్ బాబు అభిమానులు అంటున్నారు.

Telugu Mahesh Babu-Movie

అయితే నెట్టింట్లో ఇంత జరుగుతున్నప్పటికీ మహేష్ మాత్రం ఈ విషయాలపై ఏమాత్రం స్పందించ డంలేదు.కానీ సరిలేరు నీకెవ్వరు చిత్రం వసూళ్ళ విషయానికి వస్తే మాత్రం విడుదలైన మొదటి రోజే ఏకంగా 47.7కోట్లు కొల్లగొట్టి మంచి బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది.అంతేగాక ఇప్పటికే వంద కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాల సరసాలు కూడా నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube