మహేష్‌ రెండు సినిమాలు కన్ఫర్మ్‌ అయ్యాయి  

Mahesh Babu Venky Kudumula Parasuram Movie - Telugu April, Mahesh Babu, Parasuram, Venky Kudumula

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఒకేసారి రెండు సినిమాలు చేసేలా ఉన్నాడు.సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత దాదాపుగా ఆరు నెలల గ్యాప్‌ తీసుకుంటున్న మహేష్‌బాబు జూన్‌ లేదా జులై నుండి తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నట్లుగా ఆయన సన్నిహితుల నుండి సమాచారం అందుతోంది.

 Mahesh Babu Venky Kudumula Parasuram Movie - Telugu April, Mahesh Babu, Parasuram, Venky Kudumula-Latest News-Telugu Tollywood Photo Image

ఇప్పటికే మహేష్‌ 27కు దర్శకుడు పరశురామ్‌ అని తేలిపోయింది.ఇక ఆయన తదుపరి చిత్రం విషయంలో కూడా క్లారిటీ వచ్చింది.

మహేష్‌ 27వ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తూ ఉంటే 28వ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట.ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీస్‌ ఇంకా 14 రీల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

మహేష్‌ రెండు సినిమాలు కన్ఫర్మ్‌ అయ్యాయి - Mahesh Babu Venky Kudumula Parasuram Movie - Telugu April, Mahesh Babu, Parasuram, Venky Kudumula-Latest News-Telugu Tollywood Photo Image

ఈ రెండు సినిమాల కోసం మహేష్‌బాబు ఏకంగా వంద కోట్లకు పైగా పారితోషికంను అందుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలో సమ్మర్‌ ఆ వెంటనే దసరాకు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ఇప్పటి నుండే ప్రచారం జరుగుతోంది.ఒకేసారి ఇద్దరు యంగ్‌ దర్శకులతో మహేష్‌బాబు సినిమా చేయబోతుండటంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు.

తాజా వార్తలు

Mahesh Babu Venky Kudumula Parasuram Movie Related Telugu News,Photos/Pics,Images..