మహేష్ నుండి వెంకటేష్ వరకు ఎన్టీఆర్ కు బర్త్ డే విషెష్ చెప్పిన సెలెబ్రిటీలు వీరే!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును ఈ రోజు జరుపు కుంటున్నారు.ఈయన పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కు పండగ అనే చెప్పాలి.

 Mahesh Babu Venkatesh Special Wishes For Ntr Birthday , Ntr Birthday , Ntr , Ntr-TeluguStop.com

నందమూరి ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ బర్త్ డే వల్ల సందడిగా మారింది.

ఈ క్రమంలోనే ఈయన కొత్త సినిమాల అప్డేట్ లు వరుసగా రావడానికి రెడీగా ఉన్నాయి.

ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్.

ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.

ఈ రోజు బర్త్ డే జరుపు కుంటున్న నేపథ్యంలో NTR30 నుండి బిగ్ అప్డేట్ ఇప్పటికే మేకర్స్ ఇచ్చేసారు.ఈ మోషన్ పోస్టర్ లో ఎన్టీఆర్ చెప్పిన మాస్ డైలాగ్ కు ఆయన వాయిస్ కు గూస్ బంప్స్ వచ్చాయి.

మరి ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీగా ఉంది.

ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్ మాత్రమే కాదు సెలెబ్రిటీలు సైతం విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.ఆయనతో సన్నిహితంగా ఉండే హీరోలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు.మరి ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.

ఈయనకు చెప్పిన విషెష్ లో ఎక్కువగా వైరల్ అయినవి ఏవి అంటే మహేష్ బాబు, వెంకటేష్, కార్తికేయ ట్వీట్ బాగా వైరల్ అయ్యాయి.

వీరితో పాటు సాయి ధరమ్ తేజ్, వెన్నెల కిషోర్, నాగ శౌర్య, గోపీచంద్ మలినేని, సంపత్ నంది వంటి వారు విషెష్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.కార్తికేయ కొమురం భీం తో కలిసి దిగిన ఫోటో షేర్ చేయగా.మహేష్ బాబు హ్యాపీ బర్త్ డే బ్రదర్, రానున్న రోజుల్లో నీవు గొప్ప విషయాలు అందుకోవాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube