SSMB28 : యాక్షన్ సీక్వెన్స్ తోనే రంగంలోకి దిగబోతున్న మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

 Mahesh Babu Trivikram Upcoming Movie Details-TeluguStop.com

అలాగే కలెక్షన్స్ కూడా పోటీ లేకపోవడంతో దూసుకు పోతున్నాడు.మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.

మహేష్ బాబు ఈ సినిమా తర్వాత తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు.

ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు మహేష్ సన్నాహాలు చేస్తున్నాడు.

అయితే ప్రెసెంట్ మహేష్ అమెరికా వెళ్ళాడు. అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకుని ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు.

మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ తో పాటు మంచి ఎమోషన్స్ కలగలిపి ఉండేలా త్రివిక్రమ్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమా మొదటి షెడ్యూల్ కు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ జులై లో స్టార్ట్ కానుంది.మరి ఈ సినిమా ఎలాంటి సన్నివేశలతో మొదలు పెట్టబోతున్నారు అనే వార్త నెట్టింట జోరుగా ప్రచారం సాగుతుంది.

Telugu Athadu, Pooja Hegde, Khaleja, Mahesh Babu, Maheshbabu, Sarkaruvaari, Ssmb

వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో స్టార్ట్ అయ్యాయి.

ఇక ఇప్పుడు SSMB28 కూడా అదే విధంగా మంచి యాక్షన్ సన్నివేశాలతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు టాక్.త్రివిక్రమ్ స్టైల్ లో లాజిక్స్ తో ఈ యాక్షన్ సన్నివేశాలు చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.

థమన్ సంగీతం అందిస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను 2023 సంక్రాంతి లో విడుదల చేయాలనీ అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube