ఈ హీరోయిన్ తన భర్త కోసం సినీ కెరియర్ ని కూడా వదిలేసిందట….  

Mahesh babu, Tollywood Super star, Namrata shirdhkar, Tollywood, Vamshi movie - Telugu Mahesh Babu, Namrata Shirdhkar, Tollywood, Tollywood Super Star, Vamshi Movie

తెలుగు సినీ పరిశ్రమలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకి ఉన్నటువంటి క్రేజ్ గురించి చి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మహేష్ బాబు 2005వ సంవత్సరంలో వంశీ అనే చిత్రంలో నటిస్తూనే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన “నమ్రత శిరోద్కర్” ని ప్రేమించి ఇరువురి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

 Mahesh Babu Tollywood Super Star Namrata Shirdhkar

ఈ జంట ఇప్పటికీ చాలా మంది నవ దంపతులకు ఆదర్శంగా నిలుస్తోంది.

అయితే తాజాగా నమ్రతా శిరోద్కర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ హీరోయిన్ తన భర్త కోసం సినీ కెరియర్ ని కూడా వదిలేసిందట….-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే అప్పట్లో మహేష్ బాబు ని పెళ్లి చేసుకున్న అనంతరం నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబుకోసం తన సినీ కెరీర్ ని కూడా వదిలేసిందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే ఆ మధ్య కాలంలో ఈ విషయం గురించి స్పందించిన నమ్రతా శిరోద్కర్ తాను తన భర్త మహేష్ కోసం తన సినీ కెరీర్ ని వదిలేసానని అనడం కంటే త్యాగం చేశానని అంటే బాగుంటుందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

అయినప్పటికీ తనకు ఏమీ బాధ లేదని ప్రస్తుతం మహేష్ తో తన జీవితం చాలా సంతోషంగా ఉందని అంటోంది నమ్రతా శిరోద్కర్.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నమ్రతా శిరోద్కర్ ఒకపక్క పలు వ్యాపారాలు బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క పిల్లలు, కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ బిజీబిజీగా గడుపుతోంది.

మరో వైపు మహేష్ బాబు మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాల వరుస హిట్లతో దూసుకు పోతున్నాడు.

కాగా ప్రస్తుతం “సర్కారు వారి పాట” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్ర టైటిల్  పోస్టర్లు మరియు మహేష్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

#Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Tollywood Super Star Namrata Shirdhkar Related Telugu News,Photos/Pics,Images..