టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలుగా కొనసాగుతూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒకరిని మించి మరొకరు పోటీ పడుతుండడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే కొన్నిసార్లు ప్రేక్షకులలో కూడా సందేహాలు తలెత్తుతుంటాయి.

 Mahesh Babu Tollywood No 1 Tollywood No 1 Mahesh Allu Arjun-TeluguStop.com

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్,ప్రభాస్ వంటి హీరోలు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతు సినిమాలను తీస్తున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో ఏ స్థానంలో ఉన్నారనే విషయం గురించి ఆర్మాక్స్ సర్వే చేయగా ఈ సర్వేలో సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ నెంబర్ 1 హీరో స్థానాన్ని దక్కించుకున్నారు.

ఆగస్ట్ నెలకుగాను ఆర్మాక్స్ మీడియా సర్వేలో భాగంగా టాలీవుడ్ హీరోల 1 స్థానం మహేష్ బాబు కైవసం చేసుకున్నారు.ఇక 2 స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు.

 Mahesh Babu Tollywood No 1 Tollywood No 1 Mahesh Allu Arjun-టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.ఈ సర్వేలో భాగంగా 3 వ స్థానంలో పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉండగా…4 వ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు.

ఇక 5, 6 స్థానాలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కైవసం చేసుకున్నారు.

ఆర్మాక్స్ మీడియా సర్వేలో భాగంగా నాచురల్ స్టార్ నాని 7 వ స్థానంలో ఉండగా…8 వ స్థానంలో విజయ్ దేవరకొండ 9వ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి, పదవ స్థానంలో విక్టరీ వెంకటేష్ ఉన్నారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మహేష్ బాబు ఉండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో “సర్కారి వారి పాట” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు.షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

#Mahesh Babu #Chanran #Chiranjeevi #Ormax #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు