సినిమాలు లేకపోవడంతో మహేష్ ఏం చేస్తున్నాడో తెలుసా?  

Mahesh Babu To Visit Himalayas - Telugu Himalayas, Mahesh Babu, Rajinikanth, Telugu Movie News

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎవరితో సినిమా చేస్తున్నాడనే అంశంపై గతకొద్ది రోజులుగా టాలీవుడ్‌లో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.సరిలేరు నీకెవ్వరు తరువాత వంశీ పైడిపల్లితో సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు.

 Mahesh Babu To Visit Himalayas

కానీ ఆ సినిమా ఊసే లేకపోవడంతో మహేష్ నెక్ట్స్ మూవీ ఎప్పుడు, ఎవరితో ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఇటీవల కాలంలో మహేష్ కేవలం సినిమాలు, యాడ్‌లు, కుటుంబం, బిజినెస్ వంటి పనుల్లో బిజీగా ఉండటంతో ఆయనకు ప్రశాంతత అనేది లేకుండా పోయిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

సినిమాలు లేకపోవడంతో మహేష్ ఏం చేస్తున్నాడో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో మహేష్ కాస్త ప్రశాంతత కోరుతున్నాడని, దీని కోసం ఆయన హిమాలయాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది.అక్కడ ఆధ్యాత్మికతతో కూడిన ప్రశాంతత దొరుకుతుందని మహేష్ భావిస్తున్నాడట.

దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మహేష్ చేస్తున్నాడని సినీ వర్గాల టాక్.

ఏదేమైనా తమ అభిమాన నటుడు ఇలా హిమాలయాలకు వెళ్తున్నాడనే విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కొంతమేర ఆందోళన చెందుతున్నారు.

అక్కడి వెళ్లాక ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.గతంలో రజినీ కూడా హిమాలయాలకు వెళ్లాక సినిమాలు మానేస్తున్నట్లు వార్తలు రావడంతో ఇప్పుడు మహేష్ అభిమానుల్లోనూ ఇదే సందేహం నెలకొంది.

మరి ఈ విషయంపై మహేష్ ఏదైనా ప్రకటన చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు