కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక విజ్ఞప్తి చేసిన మహేష్‌బాబు  

Mahesh Babu Application To The State And Central Government-mahesh Babu,priyanka Reddy,విజ్ఞప్తి చేసిన మహేష్‌బాబు

పశువైధ్యురాలిపై జరిగిన అఘాయిత్యంపై టాలీవుడ్‌ ప్రముఖులు చాలా సీరియస్‌గా స్పందిస్తున్నారు.దిషాకు న్యాయం చేయాల్సిందే అంటూ సెలబ్రెటీలు డిమాండ్‌ చేస్తుండగా కొందరు సెలబ్రెటీలు ఇండియన్‌ న్యాయ వ్యవస్థను మార్చే రోజులు రావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.దిషా సంఘటన జరిగిన సమయంలోనే మహేష్‌బాబు స్పందించారు.చాలా దారుణమైన సంఘటన అంటూ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్‌ చేశౄడు.

Mahesh Babu Application To The State And Central Government-mahesh Babu,priyanka Reddy,విజ్ఞప్తి చేసిన మహేష్‌బాబు Telugu Tollywood Movie Cinema Film Latest News-Mahesh Babu Application To The State And Central Government-Mahesh Priyanka Reddy విజ్ఞప్తి చేసిన మహేష్‌బాబు

తాజాగా మరోసారి ఒక కవితను పోస్ట్‌ చేసి ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు.ఎంత దారుణంగా ఆమెను చంపేసిన వారిని విచారణ పేరుతో కాలం వెళ్లబుచ్చవద్దంటూ మహేష్‌బాబు కోరాడు.కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను మహేష్‌బాబు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశాడు.ఇలాంటి దారుణాలకు పాల్పడ్డ వారిని వెంటనే శిక్షించాలని, వారిని మరణ శిక్ష వేయాలంటూ మహేష్‌బాబు విజ్ఞప్తి చేశాడు.

మహేష్‌బాబు మాత్రమే కాకుండ ఇండియన్‌ సినీ పరిశ్రమకు చెందిన దాదాపు అంతా కూడా దిషా సంఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.జస్టీస్‌ ఫర్‌ దిశా హ్యాష్‌ ట్యాగ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది.సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు ఆ నలుగురిని వెంటనే చంపేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.సమాజంలో మళ్లీ అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే వెంటనే వారిని చంపేయాలంటూ మహేష్‌బాబు కూడా కోరుతున్నాడు.