స్టార్ హీరో నాలుగు నెలలు లాక్‌డౌన్.. ఎవరో తెలుసా?  

Mahesh Babu To Lockdown For 4 Months - Telugu Corona Virus, Lockdown, Mahesh Babu, Telugu Movie News

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ వైరస్ బారిన పడి లక్షలాది మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు.

 Mahesh Babu To Lockdown For 4 Months - Telugu Corona Virus, Lockdown, Mahesh Babu, Telugu Movie News-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు మరణించారు.అటు భారతదేశంలో కూడా ఈ వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ పలువురికి సోకినట్లు నిర్ధారణ కావడంతో ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను లాక్‌డౌన్ చేసి నివారణ చర్యలు ప్రారంభించింది.

స్టార్ హీరో నాలుగు నెలలు లాక్‌డౌన్.. ఎవరో తెలుసా - Mahesh Babu To Lockdown For 4 Months - Telugu Corona Virus, Lockdown, Mahesh Babu, Telugu Movie News-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ వైరస్‌కు మందు లేకపోవడమే ఇంత భయానక వాతావరణానికి కారణమని వైద్యులు అంటున్నారు.

కాగా కరోనా వైరస్ ధాటికి అన్ని రంగాలు మూతపడ్డాయి.ఇప్పటికే సినీ పరిశ్రమను పూర్తిగా మూసేసిన సంగతి విదితమే.

టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా తమ ఇళ్లకే పరిమితమయ్యారు.మరికొందరు స్వీయ నిర్భంధనకు వెళ్లారు.

కాగా తాజాగా ఓ స్టార్ హీరో తనను తాను లాక్ డౌన్ చేసుకునే యోచనలో పడ్డాడట.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏకంగా నాలుగు నెలల పాటు లాక్‌డౌన్‌లోకి వెళ్లాలని చూస్తున్నాడు.

ఆయన ప్రస్తుతం ఎలాంటి సినిమాకు కమిట్ కాకపోవడం, కరోనా వైరస్ రోజురోజుకూ తన ప్రతాపాన్ని చాటుతుండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక మహేష్ బాటలోనే మరికొంత మంది తారలు కూడా నెలల పాటు స్వీయ నిర్భంధనలోకి వెళ్లాలని చూస్తున్నారు.

తాజా వార్తలు

Mahesh Babu To Lockdown For 4 Months Related Telugu News,Photos/Pics,Images..