ఓ పిట్ట కథ చెబుతున్న మహేష్  

Mahesh Babu To Launch O Pitta Katha Teaser - Telugu Bhavya Creations, Brahmaji, Mahesh Babu, O Pitta Katha, Teaser

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతర స్టార్ హీరోల చిత్రాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు.ఈ క్రమంలో చిన్న సినిమాలను కూడా మహేష్ తరుచూ ఎంకరేజ్ చేస్తూ తన మంచితనాన్ని చాటుతుంటాడు.

Mahesh Babu To Launch O Pitta Katha Teaser

తాజాగా మరో చిన్న చిత్రాన్ని మహేష్ బాబు ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చాడు.

క్యారెక్టర్ ఆర్టిస్టు బ్రహ్మాజీ కొడుకు సంజయ్, విశ్వాంత్, నిత్యా శెట్టిలు కలిసి నటిస్తున్న ఓ పిట్ట కథ సినిమా టీజర్‌ను మహేష్ బాబు ఫిబ్రవరి 7న సాయంత్రం 5.05 నిమిషాలకు లాంఛ్ చేయనున్నాడు.టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో నటించి మంచి పేరు తెచ్చుకున్న బ్రహ్మాజీ కొడుకు ఈ సినిమాలో నటిస్తుండటంతో, ఆయనతో మహేష్‌కు మంచి సంబంధం ఉండటంతో ఈ టీజర్ లాంఛ్‌కు ఓకే చెప్పాడు సూపర్ స్టార్.

కొత్త దర్శకుడు చందు ముద్దు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.మరి సూపర్ స్టార్ సాయం ఈ సినిమాకు ఎంతమేర ఉపయోగపడుతుందో చూడాలి.

ఇక మహేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu To Launch O Pitta Katha Teaser Related Telugu News,Photos/Pics,Images..

footer-test