సూపర్‌స్టార్ మహేష్‌బాబు కెరీర్లో బిగ్గెస్ హిట్ చిత్రాల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉండే చిత్రం ‘పోకిరి’.మహేష్‌బాబు క్రేజ్‌ను అమాంతం పెంచేసిన ఆ సినిమాకు ప్రస్తుతం మహేష్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు చిన్న పోలిక ఉంది.
దాంతో మహేష్‌బాబు ఫ్యాన్స్ దాన్ని సెంటిమెంట్‌గా భావించి, ఆ సినిమా అంతటి సక్సెస్‌గా ఈ సినిమా నిలవడం ఖాయం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
ఇంతకు ఏంటా సెంటిమెంట్ అనుకుంటున్నారా.
చాలా సంవత్సరాల క్రితం విడుదలైన ‘పోకిరి’ చిత్రం ఏప్రిల్ నెలలో విడుదల అయిన విషయం తెల్సిందే.మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో ఏప్రిల్ నెలలో మహేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అందుకే సూపర్ ఫ్యాన్స్ చాలా ఆతృతతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రసాద్ వి పొట్లూరితో కలిసి స్వయంగా మహేష్‌బాబు నిర్మిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్స్‌గా ముగ్గురు ముద్దుగుమ్మలు సమంత, కాజల్, ప్రణీతలు నటిస్తున్నారు.