రాజమౌళి కంటే ముందే మరోటి అంటోన్న మహేష్  

Mahesh Babu To Do One Movie Before Rajamouli - Telugu Mahesh Babu, Rajamouli, Sarkaru Vaari Paata, Tollywood News

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న మహేష్, తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

 Mahesh Babu To Do One Movie Before Rajamouli

గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

రాజమౌళి కంటే ముందే మరోటి అంటోన్న మహేష్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.

అయితే రాజమౌళితో మహేష్ సినిమా పట్టాలెక్కాలంటే చాలా సమయం పడుతుందని, ఈ గ్యాప్‌లో మహేష్ మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరి మహేష్ రాజమౌళి కంటే ముందే ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా, అది ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తుందా అనే సందేహాలు అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయ్యాయి.

కాగా ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం మహేష్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.ఇక సర్కారు వారి పాట చిత్రాన్ని పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా పరశురామ్ తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో మహేష్ అల్ట్రా మోడ్రన్ లుక్‌లో మనకు కనిపించనున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test