తన సెంటిమెంట్‌ను మరోసారి పాటిస్తున్న మహేష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకుని తన సత్తా మరోసారి చాటాడు.దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులకు ఎసరు పెట్టాలని చూసిన మహేష్, బ్లాక్‌బస్టర్ హిట్‌గా తన సినిమాను మలుచుకుని ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు.

 Mahesh Babu To Continue His Sentiment For New Movie Launch, Mahesh Babu, Parasuram, Vamsi Paidipally, Tollywood News-TeluguStop.com

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని గీతా గోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు మహేష్.

కాగా ఈ క్రమంలో తాను ఎప్పటినుండో ఫాలో అవుతున్న ఓ సెంటిమెంట్‌ను మరోసారి ఫాలో అయ్యేందుకు మహేష్ సిద్ధమయ్యాడు.

 Mahesh Babu To Continue His Sentiment For New Movie Launch, Mahesh Babu, Parasuram, Vamsi Paidipally, Tollywood News-తన సెంటిమెంట్‌ను మరోసారి పాటిస్తున్న మహేష్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహేష్ తన సినిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడూ డుమ్మా కొడుతాడు.అలా ప్రారంభోత్సవానికి వెళ్లకపోతే అతడి సినిమా హిట్ అవుతుందని మహేష్ నమ్ముతాడు.తన భార్య నమ్రతాను ఈ ప్రారంభోత్సవానికి పంపిస్తుంటాడు.ఇప్పుడు పరశురామ్‌తో చేయబోయే సినిమాను మే 31న ప్రారంభించేందుకు మహేష్ ప్లాన్ చేస్తున్నాడు.

తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రారంభించాలని మహేష్ చూస్తున్నాడు.
అయితే ఈ ప్రారంభోత్సవానికి తన భార్య నమ్రతతో పాటు కొడుకు గౌతమ్‌ను పంపాలని మహేష్ ఫిక్స్ అయ్యాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌తో పాటు ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ ప్రారంభోత్సవాన్ని తమ ఆఫీస్‌లోనే జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్, తదితర నటీనటులు ఎవరనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube