సల్మాన్‌ను చెప్పులు అడిగిన హీరోయిన్‌

లాక్‌ డౌన్‌ కారణంగా రెండు నెలలకు పైగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కొందరు సొంత ప్రాంతాలకు వెళ్లగా కొందరు మాత్రం సొంత ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేక అక్కడే ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు.

 Actress Swara Bhaskar Request To Salman Khan Request To Slippers For Migrants, S-TeluguStop.com

అలాంటి వారి కోసం సెలబ్రెటీలు మరియు కొందరు మంచి మనసున్న వారు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.ఇటీవల దిల్లీలో హీరోయిన్‌ స్వరా భాస్కర్‌ వలస కార్మికులకు సాయం చేసేందుకు వెళ్లగా వారిలో ఎక్కువ శాతం మంది కనీసం చెప్పులు ధరించి లేరు.

ఉన్నా కూడా అవి పాడైపోయి ఉన్నాయి.

నడుచుకుంటూ వెళ్తున్న ఎంతో మంది కార్మికులకు ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశ్యంతో హీరోయిన్‌ స్వరా భాస్కర్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు ఫోన్‌ చేసింది.

ఒక ప్రముఖ చెప్పుల బ్రాండ్‌కు సల్మాన్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడనే విషయం తెల్సిందే.అందుకే ఆయనతో మాట్లాడి ఆ సంస్థకు చెందిన చెప్పులను వలస కార్మికులకు ఇవ్వాలని కోరింది.

వెంటనే సల్మాన్‌ సదరు సంస్థ ముఖ్య అధికారితో మాట్లాడి చెప్పులను పంపించేలా ఏర్పాట్లు చేశాడు.

Telugu Coronavirus, Lock, Salman Khan, Swara Bhaskar-Movie

దాదాపుగా వంద మందికి వారికి సూట్‌ అయ్యేలా చెప్పులను ఇచ్చి అది కూడా ఉచితంగా ఇచ్చి పంపించారు.ఇందుకు గాను స్వరా భాస్కర్‌ మరియు సల్మాన్‌ ఖాన్‌కు వలస కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు.సర్వా భాస్కర్‌ ఈ విషయంలో ముందుకు వచ్చి సల్మాన్‌ను ప్రేరేపించి ఆయనతో సాయం చేయించడం నిజంగా అభినందనీయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube