వామ్మో నమ్రత గాస్సిప్స్ వినలేము.. నేనైతే చెవులు మూసుకుంటా: మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారి వారి పాట సినిమా మే 12వ తేదీ విడుదలకు సిద్ధమైంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Mahesh Babu Stunning Comments On Namratha , Mahesh Babu , Namratha , Tollywood ,-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ తో కలిసి సుమతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుమ మహేష్ బాబుని ప్రశ్నిస్తూ ఎన్నో ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు.

ఈ సందర్భంగా మహేష్ బాబును ప్రశ్నిస్తూ బయట సాధారణంగా సెలబ్రిటీల గురించి ఎన్నో గాస్సిప్స్ వస్తుంటాయి.ఈ క్రమంలోనే ఇలాంటి గాస్సిప్స్ గురించి మీరు ఎక్కడైనా చర్చించుకున్నారా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు మహేష్ బాబు లేదనే సమాధానం చెప్పారు.పోనీ నమ్రత గారితో అయినా ఇలాంటి గాసిప్స్ గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ ఆసక్తికరమైన విషయాల గురించి బయటపెట్టారు.

Telugu Parashuram, Gossips, Interview Suma, Mahesh Babu, Namratha, Namrathagossi

తాను నమ్రతతో కలిసి ఎప్పుడు ఎలాంటి గాసిప్స్ గురించి మాట్లాడలేదు.కానీ నమ్రత మాత్రం తన స్నేహితులతో కలిస్తే గాసిప్స్ గురించి బోలెడన్ని మాట్లాడతారు.ఒక్కోసారి ఆ గాస్సిప్స్ నేను వినలేక చెవులు మూసుకుంటాను.

అంత చండాలంగా ఉంటాయి.అవి చెప్పడానికి కూడా రావు అంటూ మహేష్ బాబు ఇంటర్వ్యూ సందర్భంగా నమ్రత పరువు మొత్తం తీశారు.

మొత్తానికి గాసిప్స్ గురించి మహేష్ బాబు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube