మహర్షి షూటింగ్ ఆపేసి దక్షిణ ఆఫ్రికా జంప్ అయిపోయిన మహేశ్!  

మహర్షి షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి యాడ్ కోసం దక్షిణ ఆఫ్రికా వెళ్ళిన సూపర్ స్టార్ మహేశ్. .

Mahesh Babu Stop Maharshi Cinema Shooting-maharshi Cinema Shooting,mahesh Babu,pooja Hegde,super Star,telugu Cinema,tollywood

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి నెక్స్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి మహేశ్ రెడీ అవుతున్నాడు. ఇదిలా వుంటే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మహర్షికి మహేశ్ బాబు కొంత రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది...

మహర్షి షూటింగ్ ఆపేసి దక్షిణ ఆఫ్రికా జంప్ అయిపోయిన మహేశ్!-Mahesh Babu Stop Maharshi Cinema Shooting

షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన మహేశ్ దక్షిణ ఆఫ్రికా టూర్ వెళ్ళినట్లు సమాచారం.సౌత్ లో ధమ్సప్ కూల్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహేశ్ బాబు ఈ యాడ్ షూటింగ్ లో పాల్గొనడానికి దక్షిణ ఆఫ్రికా వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ షూటింగ్ ఫినిష్ అయిన వెంటనే మరల మహర్షి షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది.

అంత వరకు మహేశ్ లేకుండా ఉన్న సన్నివేశాలని దర్శకుడు వంశీ ఫినిష్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర చేస్తూ ఉండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు.