మరో రికార్డు కొట్టిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈసారి వెండితెరమీద కాదు, బుల్లితెర మీద.

థియేటర్లలో దుమ్మురేపిన శ్రీమంతుడు ఈ నెల మొదటివారంలో జీ తెలుగు ఛానెల్ లో టెలికాస్ట్ అయిన సంగతి తెలిసిందే.టీవీలో వచ్చినా, థియేటర్లకు ఏమాత్రం తగ్గకుండా హంగామా చేసారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

Srimanthudu Gets Record TRP-Srimanthudu Gets Record TRP-Latest News English-Telu

పూలదండలు,కొబ్బరికాయలు,హారతులు పట్టడమే కాకుండా రోడ్ల మీద గమికూడి ప్రొజెక్టర్లలో సినిమాని తిలకించారు.చిత్రాన్ని టీ.వీ.లో ఎంతమంది సినిమా చూసారు అనేదాని మీద టీ.ఆర్.పి రేటింగ్ ఇస్తారు అనే సంగతి తెలిసిందే కదా.శ్రీమంతుడు టీ.ఆర్.పి అత్తారింటికి దారేదిని సునాయాసంగా దాటేసి 21.24 పాయింట్లు సాధించింది.ఇది దాదాపు బాహుబలితో సమానం.

బాహుబలి మరో రాజమౌళి సినిమా అయిన మగధీరను దాటకపోవడం విశేషం.

మగధీర నుంచి టాప్ టీ.అర్.పి.పొందిన సినిమాలు ఇవే.

మగధీర : 22.7

బాహుబలి : 21.84

శ్రీమంతుడు : 21.24

అత్తారింటికి దారేది : 19.04

రోబో : 19

Advertisement
Best Foods For Your Skin

తాజా వార్తలు