మహేష్‌ అంత తెలివి తక్కువోడు కాదు!     2018-06-13   05:03:00  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు నిర్మించబోతున్న 25వ చిత్రంకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు ఈనెల చివర్లో జరుగబోతున్నాయి. మహేష్‌బాబు కెరీర్‌లో ఇదో ప్రత్యేకమైన సినిమా అవ్వడం వల్ల భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. మహేష్‌ 24వ చిత్రం భరత్‌ అనే నేను రికార్డులు బ్రేక్‌ చేసి టాలీవుడ్‌ టాప్‌ 3 చిత్రంగా నిలిచింది. ఆ స్థాయిలో సినిమాను చేసేందుకు మహేష్‌బాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. భరత్‌కు ముందు రెండు డిజాస్టర్‌లను చవిచూసిన మహేష్‌బాబు అలాంటి సినిమాల జోలికి వెళ్లను అంటూ ప్రకటించాడు.

ఈ సమయంలోనే స్పైడర్‌ చిత్రంను మరోసారి మహేష్‌బాబు చేయబోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ‘స్పైడర్‌’ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే. తమిళంతో పాటు తెలుగు హిందీల్లో మురుగదాస్‌ చిత్రాలు గతంలో బ్లాక్‌ బస్టర్‌ విజయాలను దక్కించుకున్నాయి. కాని స్పైడర్‌ మాత్రం తెలుగులో అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వగా, తమిళంలో పర్వాలేదు అనిపించుకుంది. సౌత్‌ ఆడియన్స్‌ కంటే ఈ చిత్రాన్ని నార్త్‌ ఆడియన్స్‌ ఎక్కువగా ఆధరిస్తారు అని, వారి కోసం ఈ చిత్రాన్ని చేయాలని మురుగదాస్‌ భావిస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.