టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా పనులు పూర్తి కావడంతో ఈయన తిరిగి రాజమౌళి ( Rajamouli ) సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా రాజమౌళి సినిమా పనులను నిమిత్తం ఈయన జర్మనీ వెళ్లారని తెలుస్తుంది.అయితే ఈ విషయం గురించి ఎక్కడ అధికారకంగా మాత్రం వెల్లడించలేదు.
ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం హైదరాబాదులో లేరు అయితే తన భార్య నమ్రత( Namrata ) నేడు 52వ పుట్టినరోజు ( Birthday ) వేడుకలను జరుపుకుంటున్నటువంటి తరుణంలో మహేష్ బాబు ఆమెకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలియజేశారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు నమ్రత పుట్టినరోజున పురస్కరించుకొని హ్యాపీ బర్త్ డే NSG.ఈ ఏడాది మరింత ప్రేమగా, ఆనందంగా ఉండాలి.నా ప్రతిరోజుని మరింత అందంగా, స్పెషల్ గా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని ట్వీట్ చేసాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రతిసారి తన భార్య పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా చేసే మహేష్ బాబు ఈసారి మాత్రం తన భార్యకు దూరంగా ఉన్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు జర్మనీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.ఇక సితార( Sitara ) సైతం తన తల్లికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.ఇక నమ్రత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటారు అదేవిధంగా ఈమె మరోవైపు బిజినెస్ లను కూడా ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.